ఏకగ్రీవంగా ఎన్నికైన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ..!
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని) అధ్యక్షుడిగా, సానా సతీష్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీగా విజయ్‌కుమార్, ట్రెజరర్‌గా దండమూరి శ్రీనివాస్ తో పాటు మొత్తం 34 మంది సభ్యులతో కొత్త కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ 2025-28 మూడేళ్ల కాలపరిమితి వరకు రాష్ట్ర క్రికెట్ అభివృద్ధి కోసం కృషి చేయనుంది.
ఎన్నికల ప్రక్రియ..
ఈ ఎన్నికలకు మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అయితే ఉపాధ్యక్ష అభ్యర్థి నరసింహారావు నామినేషన్ సకాలంలో వేయకపోవడంతో అది రిజక్ట్ అయ్యింది. ఫలితంగా ఉపాధ్యక్ష స్థానానికి ఉప ఎన్నికలు సెప్టెంబర్ 16న జరగనున్నాయి.

అధ్యక్షుడు కేశినేని చిన్ని కామెంట్స్..
ఏసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన కేశినేని చిన్ని మాట్లాడుతూ.. వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్ర క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించి రాష్ట్ర ఆటగాళ్లను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎక్కువ మంది ఆటగాళ్లను తయారు చేయడమే కాకుండా, ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ (ఆంధ్ర ప్రీమియర్ లీగ్) నిర్వహిస్తామని తెలిపారు. ఏసీఏ ప్రతిష్టను పెంచేలా కొత్త కమిటీ పనిచేస్తుందని ఆయన అన్నారు.
కార్యదర్శి సానా సతీష్ వ్యాఖ్యలు..
కార్యదర్శి సానా సతీష్ మాట్లాడుతూ.. గత 11 నెలలుగా ఎఫెక్స్ కమిటీ సహకారంతో బాగా పని చేశామని తెలిపారు. విశాఖ స్టేడియం అభివృద్ధి, ఏపీఎల్ టోర్నీల నిర్వహణలో విజయవంతమయ్యామని అన్నారు. జిల్లా అసోసియేషన్ల సంఖ్యను 20 లక్షల నుంచి 40 లక్షలకు పెంచామని, కొంతమంది ఆటగాళ్లను ఇంగ్లాండ్‌కు శిక్షణ కోసం పంపామని వివరించారు. అలాగే, రెడ్ బాల్, వైట్ బాల్ ఫార్మాట్ల కారణంగా ఆటగాళ్లలో గందరగోళం ఉందని గుర్తించి, వేర్వేరు ఫార్మాట్లలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు.
విష్ణు కుమార్ రాజు స్వచ్ఛందంగా ఎఫెక్స్ కమిటీ నుంచి తప్పుకున్నారని.. ఆయన విశాఖ అభివృద్ధి కోసం మాత్రమే పని చేయనున్నట్టు తెలుస్తోంది. చివరి నిమిషంలో వైస్ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేయడంతో ఆయన డిస్‌క్వాలిఫై అయ్యారని తెలిపారు. అన్ని వివాదాలను పరిష్కరించుకుంటూ, వివాదరహిత అసోసియేషన్‌గా క్రికెట్ అభివృద్ధిపై దృష్టి పెడతామని చెప్పారు.
భవిష్యత్ లక్ష్యాలు..
కమిటీ భవిష్యత్ ప్రణాళికలలో భాగంగా, ఆటగాళ్లకు అదనపు కోచ్‌లను నియమించనున్నట్లు వెల్లడించారు. అలాగే మాజీ క్రికెటర్ MSK ప్రసాద్ సేవలను గుర్తించి, ఆయన కోసం ప్రత్యేకంగా అకాడమీ స్థలం కేటాయించినట్లు తెలిపారు.
ఏసీఏ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై, మూడేళ్ల కాలంలో ఆంధ్ర క్రికెట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేయనుందని అంటున్నారు. ఏపీఎల్ టోర్నీ నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జాతీయ-అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ల తయారీ ఈ కమిటీ ప్రధాన ప్రాధాన్యతలుగా స్పష్టం చేస్తున్నారు.
-
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
Job Calendar: ఏపీలో జాబ్ క్యాలెండర్ ఖరారు? ఇవాళ సర్కార్ కీలక భేటీ..! -
ఏపీలో ఫీజురీయింబర్స్ మెంట్ పై గుడ్ న్యూస్..! సర్కార్ కీలక నిర్ణయం..! -
AP Govt: ఏపీలో ముస్లిం ఉద్యోగులకు ఆ సెలవులో మార్పు..! జీవో జారీ..! -
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
బుడ్డోడికి జడ్డూ స్పెషల్ క్లాస్! వీడియో -
AP Job Calendar: జాబ్ క్యాలెండర్ పై కీలక అప్డేట్- సర్కార్ డెడ్ లైన్..! రేపే ఖరారు..! -
క్రీడలకూ మతానికీ లింక్? వరల్డ్ కప్ వివాదంపై టాలీవుడ్ హీరోయిన్ ఫైర్! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ??











Click it and Unblock the Notifications