ఫొటో: తిరుమల శ్రీవారికి అక్షరాలా కోటి విరాళం
తిరుపతి: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు అక్షరాలా కోటి రూపాయలు విరాళం ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం వ్యాపారవేత్త టి. శ్రీనివాస రావు శుక్రవారం ఆ విరాళం ఇచ్చారు.

విరాళాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తమకు శ్రీనివాస రావు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అతిథి గృహంలో అందజేసినట్లు టిటిడి అధికారులు చెప్పారు.

అనంతమైన సంపద గల శ్రీవెంకటేశ్వర స్వామికి విరాళాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతూనే ఉంటాయి. తాను ఇచ్చి కోటి రూపాయల విరాళాన్ని భక్తుల కోసం అమలు చేస్తున్న ఉచిత భోజన పథకానికి వినియోగించాలని టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పిటిఐ వార్తాసంస్థకు తెలిపారు.
గత మూడు దశాబ్దాలుగా ఏడాదికి కోటి మంది భక్తులకు ఆ పథకం కింద ఉచిత భోజన వసతి కల్పిస్తున్నట్లు చదలవాడ తెలిపారు.












Click it and Unblock the Notifications