కెసిఆర్‌కు ఆంధ్రా ఫోబియా, నిజాం పరకాయ ప్రవేశం: నారాయణ, బాబుపై..
హైదరాబాద్: గోదావరి పుష్కరాల పేరుతో ఇరువురు ముఖ్యమంత్రులు మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నారని సిపిఐ నేత నారాయణ మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం తీసుకు వస్తున్న భూసేకరణ బిల్లుపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కెసిఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
ఎన్డీయే ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి పైన రేపు హైదరాబాదులోని సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్‌కు ఆంధ్ర ఫోబియా పట్టుకుందన్నారు. అంతేకాకుండా, ఆయనలో నిజాం నవాబు పరకాయ ప్రవేశం చేసినట్టున్నారన్నారు. ఆయన పాలన నిజాంను తలపిస్తోందన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నిర్వాకం వల్లే రాజమండ్రిలో పుష్కరాల ప్రారంభం రోజున అంతమంది మృతి చెందారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.
కోటగుమ్మం ఘాట్లో చంద్రబాబు ఉన్నప్పుడే తొక్కిసలాట జరిగిందన్నారు. 11 మంది చనిపోయారని చెప్పిన తర్వాత అక్కడి నుంచి చంద్రబాబు వెళ్లిపోయారన్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ కూడా తన నివేదికలో పేర్కొన్నారన్నారు. ఎస్పీ పైన ఒత్తిడి తెచ్చి తాను ఇలా చెప్పలేదని చెప్పించే అవకాశాలు లేకపోలేదన్నారు.












Click it and Unblock the Notifications