ఏపీలో ఒంటిపూట బడులు: టైమింగ్స్ ఇవే? పేరెంట్స్‌కు బిగ్ రిలీఫ్

Half Day Schools in Andhra Pradesh: ఏపీలో ఎండ తీవ్రత అంచనాలకు మించి పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే చోటు చేసుకుంటోన్న విద్యుత్ కోతలు దీనికి తోడవుతోన్నాయి. ఫలితంగా ఉక్కపోతకు గురి అవుతున్నారు జనం.

4 డిగ్రీలు అధికంగా..

మార్చి మొదటివారంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉండే అవకాశం ఉందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఏప్రిల్- మే నెలల్లో పగటి ఉష్ణోగ్రత గరిష్ఠంగా 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉండే అవకాశాలు లేకపోలేదు.

Andhra Govt is likely to start half-day schools on March 15 2025

పొడి వాతావరణం..

పొడి వాతావరణం కారణంగా ఎండ తీవ్రత అధికంగా ఉంటోందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. బంగాళాఖాతం మీదుగా వీస్తోన్న వేడి గాలుల వల్ల పొడి వాతావరణం నెలకొంటోంది. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని, మార్చి మొదటివారంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరువ కావొచ్చని అంచనావేసింది.

గ్రీన్ హౌస్ ఎఫెక్ట్..

వాతావరణ మార్పు ప్రభావం సైతం దీనికి తోడైనట్లు చెబుతున్నారు. అటవీ విస్తీర్ణం ఆందోళనకరంగా తగ్గిపోతోండటం, పట్టణీకరణ శరవేగంగా కొనసాగుతోండటం, గ్రీన్‌హౌస్, వాయు ఉద్గారాలు వంటి అంశాలు.. వేడిగాలుల ప్రభావాన్ని తీవ్రతరం చేస్తోన్నాయంటూ వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తోన్నారు.

సీమలో..

దీనికి అనుగుణంగా రాయలసీమ జిల్లాల్లో వేడి తీవ్రత రోజురోజుకూ అధికమౌతూ వస్తోంది. అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రత 36 డిగ్రీలు పైమాటే. ఆదోని, మంత్రాలయం, పత్తికొండ.. నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఉష్ణోగ్రత అధికంగా ఉంటోంది.

రంగంలో దిగిన ప్రభుత్వం..

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఒంటిపూట బడులను నిర్వహించడానికి అవసరమైన కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మధ్యహ్నపు ఎండ తీవ్రత గరిష్ఠస్థాయికి చేరుకునే సమయానికి వాళ్లంతా ఇళ్లకు చేరేలా టైమింగ్స్‌ను సవరిస్తుంటారు ఈ సందర్భంగా.

Take a Poll

మార్చి 15వ తేదీ నుంచి..

ఈ క్రమంలో- మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు హాఫ్ డే సెలవు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో వెలువడుతుందని అంటున్నారు.

టైమింగ్స్ ఇలా..

తరగతులు ఉదయం 7:45 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగిసేలా ఒంటిపూట బడుల టైమింగ్స్ ఉండొచ్చు. ఎండాకాలంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట బడులను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+