సచివాలయాల విభజన: గైడ్ లైన్స్ జారీ- వాళ్లు అవుట్?

Village and Ward secretariats: ఏపీలో గ్రామ- వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. కార్యరూపం దాల్చింది.

గ్రామ- వార్డు సచివాలయాల ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించిన జీఓ వెలువడింది. ఆ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని దీన్ని విడుదల చేశారు. ఫలతంగా- రాష్ట్రంలో ఉన్న అన్న గ్రామ/వార్డు సచివాలయాల వర్గీకరణ పూర్తయినట్టయింది. వాటిని ఏ, బీ, సీ కేటగిరీగా విభజించారు.

Andhra Govt issue the orders to rationalise staff in Village and Ward secretariats

మల్టీ పర్పస్, టెక్నికల్, యాస్పిరేషనల్ ఫంక్షనరీలుగా వాటిని విభజన చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

కేటగిరి ఏ: 2,500 వరకు జనాభా ఉన్న సచివాలయాలను కేటగిరి ఏ పరిధిలో చేర్చారు. ఇందులో కనీసం ఆరు గ్రామ/వార్డు సచివాలయాలు ఉంటాయి.

కేటగిరి బీ: 2,501 నుంచి 3,500 వరకు జనాభా ఉన్న సచివాలయాలను కేటగిరి బీ పరిధిలో చేర్చారు. ఇందులో కనీసం ఏడు గ్రామ/వార్డు సచివాలయాలు ఉంటాయి.

కేటగిరి సీ: 3,500లు, అంతకుమించి జనాభా ఉన్న సచివాలయాలను కేటగిరి సీ పరిధిలో చేర్చారు. ఇందులో కనీసం ఎనిమిది గ్రామ/వార్డు సచివాలయాలు ఉంటాయి.

ఇంటర్నెట్ అండ్ అదర్ థింగ్స్ (ఐఓటీ), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, మెషిన్ లెర్నింగ్, ఇతర డీప్- టెక్నాలజీల ద్వారా ఇకపై సచివాలయాలు పని చేయాల్సి ఉంటుంది. ఆయా సాంకేతిక రంగాల్లో పరిజ్ఞానం, అర్హత ఉన్న కనీస ఒక్క ఉద్యోగి సచివాలయంలో అందుబాటులో ఉండాలి.

క్రమబద్దీకరణ తరువాత గ్రామ- వార్డు సచివాలయాల మిగులు ఉద్యోగులు ఉంటే- వారిని ఫీల్డ్ ఆఫీసర్లుగా అవసరాన్ని బట్టి ఇతర ప్రభుత్వ శాఖలు/విభాగాల్లో సర్దుబాటు చేస్తారు. పంచాయతీ కార్యదర్శి/ వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి ఇకపై గ్రామ/వార్డు సచివాలయాల అధిపతిగా వ్యవహరిస్తారు.

వాటిని పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి గ్రామ/వార్డు సచివాలయాల కార్యాలయాలు, మండలం/యూఎల్‌బీ కార్యాలయాల్లో మూడంచెల విధానం అందుబాటులో ఉంటుంది. నాలెడ్జ్ సొసైటీ హబ్‌గా ఇకపై సచివాలయాలు పని చేస్తాయి. స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ లిటరసీ, ఏఐ అడాప్షన్, ఎంఎస్ఎంఈ దరఖాస్తుల స్వీకరణ, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఉపాధి అవకాశాల కేంద్రాలుగా వ్యవహరిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+