ఏపీలో అమల్లోకి కొత్త జిల్లాలు..! నోటిఫికేషన్-రేపటి నుంచి ఆ రెండూ ..!

ఏపీలో జిల్లాల పునర్విభజన కసరత్తు పూర్తయి కేబినెట్ ఆమోదం కూడా లభించడంతో కొత్త ఏడాదిలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం నిన్న కేబినెట్ లో ఆమోదించిన విధంగా రెండు కొత్త జిల్లాలు మార్కాపురం, పోలవరాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటన జారీ చేసింది. దీంతో ఈ రెండు జిల్లాలు రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. వీటితో కలిపి జిల్లాల సంఖ్య 28 కానుంది. దీంతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.

ప్రభుత్వం ఇవాళ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా ఐదు డివిజన్లను కూడా ఏర్పాటు చేశారు. తాజా మార్పుల్లో శ్రీకాకుళం జిల్లాలో నందిగామ మండలం పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలి డివిజన్‌కు మారింది. అలాగే సామర్లకోట మండలం కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్‌కు మారింది. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మార్పు జరిగింది. పెనుగొండ కాస్తా వాసవీ పెనుగొండగా మారింది. అలాగే అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్‌‌తో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటైంది. వీటితో పాటు మరికొన్ని మార్పులు కూడా ఉన్నాయి.

Andhra Pradesh Adds 2 New Districts Official Notification for Polavaram Markapuram Released

ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం రేపటి నుంచి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పులు అమల్లోకి వస్తాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, సరిహద్దు రాళ్లు, బోర్డులు కూడా మారబోతున్నాయి. అలాగే అధికారిక రికార్డుల్లోనూ మార్పలు చోటుచేసుకోబోతున్నాయి. కాబట్టి ప్రజలు కూడా వీటికి అనుగుణంగా తమ కార్యకలాపాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త ఏడాది సందర్భంగా అమల్లోకి వచ్చే ఈ మార్పులతో పాలన మరింత సజావుగా జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+