రేపు ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు
అమరావతి: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఫలితాలను రాజమహేంద్రవరం షల్టన్ హోటల్‌లో గురువారం విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాస రావు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలు విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఏపీ ఇంటర్ బోర్డు సెకండియర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించారు. పరీక్షల కోసం 457,292 విద్యార్థులు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications