• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మల్లగుల్లాలు: కేబినెట్‌లో నిర్ణయం: వాయిదాకే?

|

అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 16వ తేదీ నుంచి సుమారు 10 రోజుల పాటు అసెంబ్లీని సమావేశపరుస్తూ ఇదివరకే విడుదల చేసిన షెడ్యూల్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకోవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం తగ్గకపోవడం వల్లే మరోసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయడం వైపే మొగ్గు చూపుతోందని అంటున్నారు. దీనిపై గురువారం నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.

షెడ్యూల్ ప్రకారం.. 16న

షెడ్యూల్ ప్రకారం.. 16న

షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 16వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. 18వ తేదీన ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది కూడా. తాజాగా దీనిపై మల్లగుల్లాలు పడుతోంది. అసెంబ్లీని సమావేశ పర్చాలా? వద్దా? అని తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కరోనా వైరస్‌లో తీవ్రతలో మార్పు లేకపోవడం.. పైగా రోజూ వందకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం వల్ల ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలపై పునారాలోచన చేస్తోందని తెలుస్తోంది.

శాసనసభ్యులు.. వారి వ్యక్తిగత సిబ్బంది..

శాసనసభ్యులు.. వారి వ్యక్తిగత సిబ్బంది..

అసెంబ్లీ సమావేశాలంటే.. వందలామంది మంది ఒకే చోట గుమికూడుతుంటారు. అది సహజం. రాష్ట్రం నలుమూలల నుంచీ శాసన సభ్యులు, వారి అనుచరులు, వ్యక్తిగత కార్యదర్శులు, డ్రైవర్లు ఇలా పెద్ద సంఖ్యలో తరలి రావాల్సి వస్తుంటారు. 175 మంది శాసనసభ్యులకు ఒక్కొక్కరి వెంట కనీసం అయిదుమంది సహాయకులుగా వచ్చినా వెయ్యిమంది వరకు ఒకేచోట గుమికూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వారికి తోడు- అధికారులు. బడ్జెట్ సమావేశాలు కావడం వల్ల దాదాపు అన్ని శాఖల నుంచి అధికారులు శాసనసభకు రావాల్సి ఉంటుంది.

సచివాలయ ఉద్యోగులు కరోనా బారిన..

సచివాలయ ఉద్యోగులు కరోనా బారిన..

పైగా ఇప్పటికే పలువురు సచివాలయ ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడ్డారు. నేరుగా ముఖ్యమంత్రి పర్యవేక్షించే సాధారణ పరిపాలన శాఖ సహా వివిధ విభాగాలకు చెందిన 12 మందికి పైగా ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. పరిమితంగా సచివాలయానికి ఉద్యోగులను హాజరు పరిచిన ఈ పరిస్థితుల్లోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందితే.. ఇక అసెంబ్లీని సమావేశపర్చితే.. దాని తీవ్రత మరింత పెరిగే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమౌతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపవచ్చని అంటున్నారు.

సభలో భౌతిక దూరం పాటించడమూ కష్టమే..

సభలో భౌతిక దూరం పాటించడమూ కష్టమే..

సభలో భౌతిక దూరాన్ని పాటించడం కూడా కష్టతరమౌతుందని అంటున్నారు. భౌతిక దూరాన్ని పాటించాల్సి వస్తే..
సభ్యులు ఒక్కొక్క సీటును వదిలేసి కూర్చోవాల్సి ఉంటుంది. అలా చేయడానికి అవసరమైనంత విశాల ప్రాంగణం అసెంబ్లీలో లేదు. ప్రస్తుతం సభలో 225 స్థానాలే ఉన్నాయి. ఒక్కో సీటును వదిలేసి కూర్చోవాలంటే ఇప్పుడున్న స్థలం ఏ మాత్రం చాలదు. కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అవసరమైన ముందుజాగ్రత్తలను తీసుకుంటూ సభను సమావేశ పర్చడం ఎంత వరకు సాధ్యపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

బందోబస్తు కోసం

బందోబస్తు కోసం

అసెంబ్లీ బందోబస్తును నిర్వహించడానికి రాష్ట్రం నలుమూలల నుంచీ కనీసం మూడువేల మంది పోలీసు సిబ్బంది అవసరం అవుతారు. వారిని అసెంబ్లీ దాకా రప్పించడం ఒక ఎత్తయితే.. వచ్చిన తరువాత భౌతిక దూరాన్ని పాటించేలా భద్రతను కొనసాగించడం మరో ఎత్తు అవుతుంది. ఇంతమంది పెద్ద ఎత్తున ఒకే చోట ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు పాటించడం కష్టతరమౌతుందని అధికారులు చెబుతున్నారు.

  Janasena Leader Naga Babu Comments On Telugu Media
  ఈ సారి కూడా ఓటాన్ అకౌంట్‌తోనే

  ఈ సారి కూడా ఓటాన్ అకౌంట్‌తోనే

  మార్చి తరహాలోనే ఈ సారి కూడా మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్‌గానే బడ్జెట్‌ను ఆమోదించడమే మంచిదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహించకుండా ఓటాన్ అకౌంట్ ద్వారా బడ్జెట్ ప్రతిపాదనలను ఆమెదించడానికి మరోసారి ఆర్జినెన్స్ జారీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై గురువారం నిర్వహించబోయే మంత్రివర్గ సమావేశంలో ఓ స్పష్టత రావచ్చని తెలుస్తోంది.

  English summary
  Andhra Pradesh Assembly budget Sessions-2020, Which is proposed and scheduled as starting from 16th of June, is once again likely to be postponed due to Coronavirus Covid-19 outbreak. AP Government will take Specific decision in this issue in next Cabinet meeting.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X