ఏపీ బడ్జెట్ సమావేశాలు: సంక్షేమానికి పెద్దపీట; వర్గాల వారిగా నిధులు !! రూ. 2.56 లక్షల కోట్లతో బడ్జెట్
సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ.. నవరత్నాల అమలే లక్ష్యంగా ఆర్దిక మంత్రి బుగ్గన శాసనసభలో 2022-23 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మొత్తం 2,56,256 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. రెవిన్యూ వ్యవయం 2,08,261 కోట్లు కాగా, మూల ధన వ్యవయం రూ 47,996 కోట్లుగా పేర్కొన్నారు. ఇక..రెవిన్యూ లోటు రూ 17,036 కోట్లు గా వెల్లడించారు. ద్రవ్య లోటు రూ. 48, 724 కోట్లుగా ప్రతిపాదించారు. ఇక, సంక్షేమ కేటాయింపుల్లో భాగంగా బీసీ సంక్షేమానికి రూ 20,962 కోట్లు ప్రతిపాదించారు. సాంఘిక సంక్షేమం కోసం రూ. 12,728 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించారు . గణనీయంగా తగ్గిపోయిన రాష్ట్ర రెవిన్యూ కారణంగా కేంద్ర పన్నుల వాటాపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది జగన్ సర్కార్.

ముందు నుంచి చెబుతున్నట్లుగానే జగన్ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేసింది. అందులో బీసీ..ఎస్సీ..ఎస్టీ..మైనార్టీ వర్గాలతో పాటుగా ఆర్దికంగా వెనుక బడిన వర్గాలకు కేటాయింపులు చేసింది. ఇక, సామాజిక వర్గాల వారీగా ఏర్పాటు చేసిన కార్పోరేషన్లను నిధులు కేటాయింపులు చేసారు. రెవిన్యూ లోటు ఉన్నా సంక్షేమం విషయంలో వెనక్కి తగ్గేది లేదంటుంది జగన్ ప్రభుత్వం. ఇలాంటి విషయాలతో పాటు బడ్జెట్‌కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..












Click it and Unblock the Notifications