AP Assembly election Lok Sabha 2024 Phase 4 Polling LIVE: ముగిసి పోలింగ్, ఓటేసిన పొలిటికల్, సినీ స్టార్స్ వీరే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికలు 4వ విడత పోలింగ్ ప్రత్యక్ష ప్రసారం :దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గవ దశ పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.నాల్గవ దశ పోలింగ్‌లో భాగంగా ఇటు ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. గత రెండు నెలలుగా ప్రచారంతో హోరెత్తించిన పార్టీలు శనివారంతో ముగింపు పలికాయి. ఇక అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నాల్గవ దశలో మే 13వ తేదీన మొత్తంగా 10 రాష్ట్రాల నుంచి 96 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.
నాల్గవ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిషా, జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతాయి.ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ సమయాలను ఇప్పటికే ఈసీ విడుదల చేసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా.. మిగతా ప్రాంతాల్లో 6 గంటల వరకు క్యూలైన్లో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు అనుమతించారు. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల పోలింగ్‌కు సంబంధించి మినిట్-టు-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.














Click it and Unblock the Notifications