బర్డ్ ఫ్లూ భయం: తెలంగాణ చికెన్‌పై ఆంధ్రప్రదేశ్ బ్యాన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ భయం వణికిస్తున్న తరుణంలో పౌల్ట్రీ, దాని ఉత్పత్తుల ప్రవేశంపై ఆంధ్రప్రదేశ్ నిషేధం విధించింది. తెలంగాణలో బర్డ్ ఫ్లూ ప్రబలిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పశు సంవర్థక శాఖ, రవాణా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమావేశమై చర్చలు జరిపి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ నుంచి చికెన్, ఇతర కోళ్ల పరిశ్రమ ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల అధికారులను ఆదేశించారు. తెలంగాణ నుంచి ఎపిలోకి పౌల్ట్రీ రవాణాను ఆపేయాలని రవాణా శాఖను ఆదేశించినట్లు అధికారులు చెప్పారు. తెలంగాణ నుంచి ఎపిలోకి చికెన్ తదితర పౌల్ట్రీ ఉత్పత్తులు ప్రవేశించకుండా తనిఖీలు నిర్వహించాడనికి సంయుక్త బృందాలను ఏర్పాటు చేశారు.

దాదాపు 1.45 కోళ్లను ధ్వంసం చేసినట్లు, ఆ రకంగా బర్డ్ ఫ్లూ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత బర్డ్ ఫ్లూ వ్యాపించడం ఇదే మొదటి సారి.
కోళ్ల పరిశ్రమ రైతులపై బర్డ్ ఫ్లూ తీవ్రమైన ప్రభావం చూపింది. దాదాపు 50 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications