రాజధాని నుంచి మెట్రో దాకా..: కాపులకు 1000 కోట్లు, నిరుద్యోగులకు 500 కోట్లు
ఏపీ శాసన సభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. మండలిలో మంత్రి నారాయణ ప్రవేశ పెడతారు. బడ్జెట్ తర్వాత మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెడతారు.
అమరావతి: ఏపీ శాసన సభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టారు. కాపు కార్పోరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. నిరుద్యోగ భృతికి రూ.500 కోట్లు కేటాయించారు.
బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేక హోదా, విభజన అంశాలను ప్రస్తావించారు. పక్క రాష్ట్రాల ప్రజల మనోభావాల మేరకు విభజన జరిగిందన్నారు. విభజన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. ఆర్థిక సంఘం హోదా ఇవ్వవద్దని చెప్పిందని, ప్రత్యామ్నాయంగా మంచి ప్యాకేజీ సాధించుకున్నామన్నారు.
- రాష్ట్ర బడ్జెట్ 1,56,999 కోట్లు
- రెవెన్యూ రెవెన్యూ లోటు రూ.1,25,911 కోట్లు
- నిర్వహణ వ్యయం రూ.31,087 కోట్లు
- ఆర్థిక లోటు రూ.23,054 కోట్లు
- విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.100 కోట్లు
- విశాఖ, కాకినాడ, తిరుపతి పట్టణాభివృద్ధికి రూ.450 కోట్లు
- 9 రంగాల ఆధారంగా రాజధాని నిర్మాణం.
- అమరావతి దేశానికే నమూనా రాజధానిగా నిలుస్తుంది.
- 192 రోజుల్లో అసెంబ్లీని నిర్మించుకున్నాం
- 33 అమృత్ నగరాలకు రాష్ట్రాల వాటా కింద రూ.300 కోట్లు
- 13 ఆకర్షణీయ నగరాలకు రూ.150 కోట్లు

- అధికారా భాష స్థానంలో తెలుగు భాషా ప్రాధికారక సంస్థ ఏర్పాటు
- పారిశ్రామిక రంగంలో 10.05 శాతం వృద్ధి రేటు
- ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు రూ.502 కోట్లు
- సేవా రంగంల 10.16 శాతం వృద్ధి రేటు
- 2016-17 సంవత్సరానికి 11.61 శాతం వృద్ధి రేటు సాధించాం.
- అమరావతిలో అంబేడ్కర్ స్మృతి వనానికి రూ.97 కోట్లు
- పాలు, కోడిగుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం ముందంజలో ఉంది.
- 2029 నాటికి ఏటా 12 శాతం వృద్ధి రేటు లక్ష్యం.
- విజన్ 2029 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుంది.
- దేశంలో పండ్ల ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానంలో ఉంది.
- రానున్న రెండేళ్లలో లక్ష ఇళ్ల నిర్మాణం
- ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.124 కోట్లు
- రహదారుల శాఖకు రూ.501 కోట్లు
- పంచాయతీరాజ్ శాఖకు రూ.6,562 కోట్లు
- పౌరసరఫరాల శాఖకు రూ.350 కోట్లు
- దుల్హన్ పథకానికి రూ.60 కోట్లు
- వక్ఫ్ సర్వే కమిషన్‌కు రూ.50 కోట్లు
- క్రైస్తవ ఫైనాన్స్ కార్పోరేషన్‍కు రూ.35 కోట్లు
- బ్రాహ్మణ కార్పోరేషన్‌కు రూ.75 కోట్లు
- కాపు కార్పేరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు
- అన్న క్యాంటీన్లకు రూ.200 కోట్లు
- నిరుపేదల విద్యుత్ రాయితీకి రూ.3,300 కోట్లు
- వికలాంగుల సంక్షేమానికి రూ.90 కోట్లు
- షాదీ ఖానాలకు రూ.15 కోట్లు
- మైనార్టీల ఉపకారవేతనాలకు రూ.240 కోట్లు
- స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 1,773 కోట్లు
- శాంతి భద్రతలకు రూ.5,221 కోట్లు
- సూక్ష్మ సేద్యం, ఆయిల్, ఫాం, ఇతర రంగాలకు రూ.1,015 కోట్లు
- ఇమామ్, మౌజన్ల ప్రోత్సాహానికి రూ.24 కోట్లు
- మైనార్టీల విదేశీ విద్యకు రూ.5 కోట్లు
- బీసీ సంక్షేమానికి రూ.10వేల కోట్లు
- ఈబీసీల సంక్షేమానికి రూ.695 కోట్లు
- పశుగణాభివృద్ధికి రూ.1,112 కోట్లు
- నీటి పారుదలకు రూ.12,770 కోట్లు
- సాంస్కృతిక శాఖకు రూ.78 కోట్లు
- రవాణా శాఖకు రూ.3,946 కోట్లు
- చిన్నతరహా పరిశ్రమలకు రూ.2,086 కోట్లు
- సాధారణ ఆర్థిక సర్వీసులు రూ.4,272 కోట్లు
- గ్రామీణాభివృద్ధికి రూ.19,525 కోట్లు
- తాగునీరు, పారిశుద్ధ్య రంగానికి రూ.1,525 కోట్లు
- సంక్షేమ శాఖకు రూ.11,361 కోట్లు
- మత్స్యశాఖకు రూ.282 కోట్లు
- పరిశ్రమల శాఖకు రూ.369 కోట్లు
- నిరుద్యోగ భృతికి రూ.500 కోట్లు
- కార్మిక, విద్యారంగంకు రూ.425 కోట్లు
- సమాచార ప్రసార శాఖకు రూ.152 కోట్లు
- పరిశ్రమలు, ఖనిజాలు రూ. 1,665 కోట్లు
- పట్టణాభివృద్ధికి రూ.4,216 కోట్లు
- జల వనరులు, వరద నివారణకు రూ.701 కోట్లు
- ఐటీ శాఖకు రూ.364 కోట్లు
- ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.9,848 కోట్లు
- గ్రామీణ మహిళ గ్యాస్ కనెక్షన్లకు రూ.150 కోట్లు
- డ్వాక్రా మహిళలకు రూ.1,600 కోట్లు
- గ్రామీణ రహదారులకు రూ.262 కోట్లు
- సామాజిక భద్రత, సంక్షేమం కోసం రూ.1,636 కోట్లు
- గృహ నిర్మాణానికి రూ.1,326 కోట్లు
- విద్యుత్ రంగానికి రూ.3,737 కోట్లు
- ఆరోగ్య శాఖకు రూ.7,050 కోట్లు
- మహిళా సాధికారతకు రూ.400 కోట్లు
- రుణమాఫీకి రూ.3,600 కోట్లు
- నైపుణ్యాల అభివృద్ధికి రూ.398 కోట్లు
- ఎన్టీఆర్ సుజల పథకానికి రూ.100 కోట్లు
- ఎన్టీఆర్ వైద్య సేవలకు రూ.1,000 కోట్లు
- ప్రజా పంపిణీ పథకానికి రూ.2,800 కోట్లు
- సాంకేతిక విద్యకు రూ.728 కోట్లు
- వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 9,091 కోట్లు
- నీరు, పారిశుద్ధ్యంకు రూ.1,575 కోట్లు
- హోంశాఖకు రూ.5,221 కోట్లు
- విద్యాశాఖకు రూ.20,385 కోట్లు
- క్రీడలు, యువజన సేవలకు రూ.810 కోట్లు
- రాజధాని అభివృద్ధికి రూ.1,061 కోట్లు
- విద్య, వైద్య శాఖకు రూ.6,574 కోట్లు
- రెండున్నరేళ్లలో ఇబ్బందులు తట్టుకొని నిలబడ్డాం.
- అమరావతికి రావడం వల్ల అభివృద్ధి వేగవంతమైంది.
- విజన్ 2029ను సాకారం చేసుకోవాలన్నదే ప్రభుత్వం లక్ష్యం.
- శక్తి, ఇంధన రంగాల్లో ఐదు పురస్కారాలు ఏపీకి దక్కాయి.
- పరోక్ష పన్నుల స్థానంలో జీఎస్టీ వస్తోందని చెప్పారు. జీఎస్టీ వల్ల రాబోయే కాలంలో రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుంది.
- ప్రాచీన సంస్కృతిని కాపాడుకుంటూనే ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించడం లక్ష్యం.
- ప్రత్యేక హోదాను కేంద్రం రద్దు చేస్తున్నందున ఆ మేరకు ప్రత్యేక ప్యాకేజీ రాబడుతున్నాం.
- స్థూల జాతీయోత్పత్తిలో దేశంలోనే తొలి స్థానంలో ఉన్నాం.
- పక్క రాష్ట్ర (తెలంగాణ) ప్రజల మనోభావాల మేరకు విభజన జరిగింది.
- గం.10.25 నిమిషాలకు యనమల బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. అమరావతిలో ఇది తొలి అసెంబ్లీ. అలాగే తొలి బడ్జెట్.
- గవర్నర్ ఆమోదం కోసం ఈ ఫైలింగ్ ద్వారా కేబినెట్ బడ్జెట్‌ను పంపించింది.
- బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
-
బడి పిల్లలు శోభనం పెళ్లి కొడుకులా? ఏంటిది - గరికపాటి వ్యాఖ్యల వివాదం..!! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications