ఏపీ సీఎం చంద్రబాబుతో బ్రహ్మానందం (ఫోటోలు)

హైదరాబాద్: హుధుద్ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రను ఆదుకునేందుకు అనేక మంది ముందుకువచ్చి ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. విశాఖ తుపాను బాధితులను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సినీ ప్రముఖులు మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు.

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును తన నివాసంలో కలిసి సీఎం సహాయనిధికి సినీ నటుడు బ్రహ్మానందం రూ. 3 లక్షల చెక్కును అందజేశారు. చంద్రబాబును కలిసిన వారిలో రాఘవేంద్రరావు, బ్రహ్మానందం, కాట్రగడ్డ ప్రసాద్‌, అశోక్‌కుమార్‌ ఉన్నారు.

ఆ తర్వాత చంద్రబాబు నాయుడుని కలిసిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చెన్నై ప్రెసిడెంట్ బి సతీష్ కుమార్ రూ. లక్ష రూపాయల చెక్కుని సీఎం సహాయనిధికి అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

మంగళవారం నగరంలోని బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరంగల్‌ జిల్లా టీడీపీ నేత బస్వారెడ్డిని బాబు పరామర్శించారు. విజయవాడలోనూ ఆస్పత్రిని నిర్మించాలని ఆస్పత్రి చైర్మన్‌, ఎమ్మెల్యే బాలకృష్ణను కోరినట్లు ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. విజయవాడలో బసవతారకం ఆస్పత్రి నిర్మాణానికి స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

 ఏపీ సీఎం చంద్రబాబుతో బ్రహ్మానందం

ఏపీ సీఎం చంద్రబాబుతో బ్రహ్మానందం

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును తన నివాసంలో కలిసి సీఎం సహాయనిధికి సినీ నటుడు బ్రహ్మానందం రూ. 3 లక్షల చెక్కును అందజేశారు.

 సీఎం సహాయనిధికి విరాళాలు

సీఎం సహాయనిధికి విరాళాలు

చంద్రబాబు నాయుడుని కలిసిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చెన్నై ప్రెసిడెంట్ బి సతీష్ కుమార్ రూ. లక్ష రూపాయల చెక్కుని సీఎం సహాయనిధికి అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

 టీడీపీ నేత బస్వారెడ్డిని పరామర్శించిన బాబు

టీడీపీ నేత బస్వారెడ్డిని పరామర్శించిన బాబు

మంగళవారం నగరంలోని బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరంగల్‌ జిల్లా టీడీపీ నేత బస్వారెడ్డిని బాబు పరామర్శించారు.

బసవతారకం ఆస్పత్రిలో చంద్రబాబు

బసవతారకం ఆస్పత్రిలో చంద్రబాబు


మంగళవారం నగరంలోని బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ధ్రితి రెడ్డిని ఆప్యాయంగా పలకరించిన ఏపీ సీఎం చంద్రబాబు.

సాకేత్‌ను సన్మానించిన బాబు

సాకేత్‌ను సన్మానించిన బాబు

దక్షణకొరియాలోని ఇంచియాన్‌లో బంగారు పతకం సాధించిన సాకేత్‌ను సన్మానించిన ఏపీ సీఎం చంద్రబాబు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+