తిరుమలలో సీఎం జగన్, శ్రీవారికి పట్టు వస్త్రాలు, టీటీడీ క్యాలెండర్లు విడుదల !

తిరుమల/తిరుపతి: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన సోమ‌వారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌. జ‌గ‌న్‌ మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు సీఎం జగన్ చేరుకున్నారు.

 CM YS Jagan Mohan Reddy

టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు (టీటీడీ చైర్మన్) భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, టీటీడీ ఈవో ఎవీ.ధ‌ర్మారెడ్డి సీఎం వైఎస్ జగన్ కు స్వాగతం పలికారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని సీఎం జగన్ దర్శించుకున్నారు.

 CM YS Jagan Mohan Reddy

అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళంకారీ చిత్రపటాన్ని సీఎం జగన్ కు అందజేశారు. శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో మొద‌టి రోజైన సోమ‌వారం రాత్రి స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌. జ‌గ‌న్‌ మోహ‌న్‌రెడ్డి టీటీడీ ముద్రించిన 2024వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు.

ప్రతిఏడాది టీటీడీ శ్రీవెంకటేశ్వర స్వామి చిత్రాలతో ప్రత్యేకంగా క్యాలెండర్లు ముద్రిస్తున్న విషయం తెలిసిందే. 12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, పెద్ద డైరీలు 8.25 లక్షలు, చిన్నడైరీలు 1.50 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 1.25 ల‌క్ష‌లు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.50 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది.

డైరీలు, క్యాలెండర్లు సెప్టెంబరు 22 నుండి తిరుమల, తిరుపతిలో అందుబాటులో ఉంటాయి. అక్టోబరు రెండో వారం నుండి ఇతర ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.
అంతకు ముందు తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం విచ్చేసే భ‌క్తుల కోసం దాత‌ల స‌హ‌కారంతో టీటీడీ నిర్మించిన రెండు విశ్రాంతి గృహాల‌ను సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.

తిరుమలలోని పద్మావతి ఏరియాలో రూ. 20 కోట్ల‌తో వ‌కుళామాత నిల‌యం విశ్రాంతి గృహాన్ని దాత రాజేష్ శర్మ, రూ. 11.50 కోట్ల‌తో శ్రీ ర‌చ‌న విశ్రాంతి గృహాన్ని దాత నరేంద్ర చౌదరి నిర్మించారు. ఈ రెండు విశ్రాంతి గృహాల్లో క‌లిపి 24 గ‌దులు భ‌క్తుల‌కు అందుబాటులోకి ఉన్నాయి. తిరుమలలో కొత్తగా నిర్మించిన ఈ గదులు భక్తులకు అందుబాటులో ఉంటాయి.

 CM YS Jagan Mohan Reddy

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, రోజా, టీటీడీ ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, బోర్డు సభ్యులు యానాదయ్య, ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రహ్మణ్యం, భరత్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, బియ్యపు మధుసూదన్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, మధుసూదన్ యాదవ్, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జాయింట్ కలెక్టర్ డీకే బాలాజి,జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, వీర‌బ్ర‌హ్మం, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి హరిత‌ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+