ఏపీలో డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల: రేపట్నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం అడ్మిషన్లకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసి ఏపీ ఉన్నత విద్యా మండలి.
రాష్ట్రంలో రెండేళ్లుగా ఆన్ లైన్ విధానంలో నిర్వహిస్తున్నట్లుగానే కౌన్సిలింగ్ జరగనుంది.
ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కాలేజీలన్నీ ఆర్ట్స్, సైన్సెస్, సోషల్ సైన్సెస్, కామర్స్, మేనేజ్ మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, సోషల్ వర్క్ తదితర(హానర్స్ కలిపి) డిగ్రీ కోర్సుల్లోకి అడ్మిషన్ల ప్రక్రియ జులై 23 నుంచి ప్రారంభమవుతోంది.

ఏపీలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయి, ఫలితాలు విడుదలయ్యేసరికి ఆగస్టు చివరి వరకు సమయం పట్టేలా ఉండటంతో అప్పటి వరకు విద్యార్థులు వేచిచూడకుండా ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పూర్తి ఆన్‌లైన్ విధానంలోనే ఉన్నత విద్యా మండలి వెబ్ సైట్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ జరగనుంది. జులై 23 నుంచి 31 వరకు విద్యార్థుల రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి
ఆగస్టు 1 నుంచి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో, హెచ్‌ఎల్‌సీల్లో సర్టిఫికెట్ల పరిశీలన, అలాగే 3, 4 తేదీల్లో స్పెషల్ కేటగిరి వెరిఫికేషన్ జరగనుంది. ఆగస్టు 8 నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 13 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ ఎడిటింగ్, సవరణలకు అవకాశం ఉంటుంది.
ఆగస్టు 20న సీట్ల అలాట్‌మెంట్ జరుగుతుంది. 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సీట్లు పొందిన విద్యార్థులు తమ తమ కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. ఆగస్టు 25వ తేదీ నుంచి డిగ్రీ విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. స్పెషల్ కేటగిరి విద్యార్థులకు విజయవాడలోని ఎస్‌ఆర్ ఆర్ కళాశాల, విశాఖపట్నంలోని డా. వీఎస్ కృష్ణ కళాశాల, తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఆగస్టు 3, 4 తేదీల్లో జరుగుతుంది.












Click it and Unblock the Notifications