ఏపీలో ముగిసిన ప్రచార పర్వం... చాప క్రింద నీరులా ప్రలోభాల పర్వం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఏపీలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 13వ తేదీన పోలింగ్ జరగనున్న క్రమంలో గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఇక నేడు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఇక చాప క్రింద నీరులా ప్రలోభాల పర్వం శురూ అయినట్టు తెలుస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా మూగబోయిన మైకులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం నాలుగు గంటలకు, సమస్యాత్మక నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో ఐదు గంటలకు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశారు. ఇక రాష్ట్రంలో మిగతా 169 అసెంబ్లీ నియోజకవర్గాలలో సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మైకులు మూగబోయాయి.

జాతీయ రాష్ట్ర స్థాయి నాయకుల ఎన్నికల ప్రచారం
ఇప్పటినుంచి 48 గంటల పాటు నిశ్శబ్ద వాతావరణం కొనసాగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని సాగించారు. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులు హోరాహోరీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.
13 సమస్యాత్మక సెగ్మెంట్లలోసాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 13వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక రాష్ట్రంలో 13 సమస్యాత్మక సెగ్మెంట్లలో సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
ఎన్నికల పోలింగ్ నేపధ్యంలో ఆంక్షలు
ఎన్నికల పోలింగ్ కు ముందు ఆంక్షలను విధించిన ఈసీ 144 సెక్షన్ అమలు నేపథ్యంలో, ఐదుగురికి మించి ఎక్కడైనా గుమి కూడితే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక ఎన్నికలు ముగిసే వరకు రెండు రోజులపాటు మద్యం దుకాణాలు మూసి వేయబడతాయని తెలిపారు. లిక్కర్ అమ్మకాలు నిషిద్ధమని పేర్కొన్నారు. ఇక ఎన్నికల ప్రలోభాలపై పూర్తి నిఘా పెట్టినట్టు చెప్పారు.
ప్రలోభాలకు లొంగకుండా ఓటెయ్యాలి
ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రచారాలు చేయకూడదని మొబైల్ ద్వారా సందేశాలను కూడా పంపకూడదని, ఒపీనియన్ సర్వేలు వెల్లడించకూడదని, ఎలాంటి ఎడ్వర్టైజ్మెంట్లు నిర్వహించకూడదని పేర్కొన్నారు ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు ఎన్నికల అధికారులు.ప్రలోభాలకు లొంగకుండా ఓట్లు వెయ్యాలని సూచించారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications