బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

వేసవిలో ఏపీని చిరుజల్లులు, అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పలకరిస్తోన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ వరకూ పలు చోట్ల ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఎండ వేడి నుంచి కొంత ఉపశమనాన్ని కలిగించినప్పటికీ- రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. వర్షాలు క్రమంగా తగ్గి, ఎండ తీవ్రత రెట్టింపు అవుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.

Andhra Pradesh Faces Lightning as Thunderstorms and Heavy Rains Loom in Multiple Districts Next 3 days

వీటితో పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడొచ్చు. రాయలసీమపైనా దీని ప్రభావం పడుతుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపురంలో 57.5, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 52.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

మరోవంక రాష్ట్రంలో మెజారిటీ జిల్లాల్లో ఎండ తీవ్రతలో మార్పు ఉండట్లేదు. పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తోన్నాయి. జనాలను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోన్నాయి. నేడు నెల్లూరు జిల్లా మనుబోలు, చిల్లకూరు, గుడూరుతో పాటు తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక, దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్ళకూరు మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నట్లు ప్రఖర్ జైన్ తెలిపారు.

అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ 42 డిగ్రీల సెల్సియస్ మేర ఎండ తీవ్రత రికార్డయింది. కడప జిల్లా రాజుపాలెంలో 41.9, మార్కాపురం జిల్లా నందన మారెళ్లలో 40.7, నంద్యాల జిల్లా పేరుసోమలలో 40.6, నెల్లూరు జిల్లా వరికుంటపాడులో 40.3 డిగ్రీల సెల్సియస్ మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి,

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+