కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా: త్వరలో బీజేపీలోకి!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు.

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలను కలిసినట్లు తెలిసింది.

ఈ క్రమంలో త్వరలోనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారని సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా, ఉమ్మడి ఏపీ చివరి సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత సమైక్యాంధ్ర పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. అయితే, ఆయన సహా ఆ పార్టీ నుంచి ఎవరూ గెలవలేదు.

 Andhra Pradesh former CM Kiran Kumar Reddy resigned for Congress party: likely to join BJP soon.

ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలోనే చేరారు కిరణ్ కుమార్ రెడ్డి. అయితే, ఆ పార్టీలో చాలా కాలంగా ఆయన క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరి మరోసారి రాజకీయాల్లో క్రియశీల రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్టన్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ నేత బీజేపీలో చేరడం ఆ పార్టీకి కొంత కలిసివచ్చే అవకాశమేనని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+