మందుబాబులకు గుడ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ లో చిత్రవిచిత్రమైన లిక్కర్ బ్రాండ్లకు చెక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో మందుబాబులు కోరుకున్న మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. గత ఐదు సంవత్సరాల పాటు చిత్రవిచిత్రమైన లిక్కర్ తాగిన మందుబాబులు ఇక మందు మనస్పూర్ఫిగా మద్యం సేవించడానికి అవకాశం చిక్కినట్లు అయ్యిందని అప్పుడే సోషల్ మీడియాలో మీమ్స్ మొదలైనాయి.
ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వంలో కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. గతంలో ఎన్నడూ వినని పేర్లు, కొత్తకొత్త బ్రాండ్ల విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వోడ్కా సైతం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇక దేశం మొత్తం విక్రయించే బ్రాండ్ బీర్లకు బదులుగా బూమ్ బూమ్ బీర్లతో పాటు కొత్తకొత్త బీర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే అప్పటికే మద్యంకు బానిస అయిన మందుబాబులు షాక్ తిన్నారు.

కొత్తకొత్త బ్రాండ్ల మద్యంతో పాటు వాటి ధరలను విపరీతంగా పెంచిన అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏకంగా ప్రభుత్వ లిక్కర్ షాపుల్లోనే ఆ మద్యం విక్రయించింది. మద్యం విక్రయించే వారికి షాక్ ఇవ్వడానికి మద్యం రేట్లు పెంచామని, ఎక్కువ డబ్బులు పెట్టి లిక్కర్ కొనలేక మద్యం మానేస్తారని అప్పటి వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు మీడియా ముందు దంచికొట్టారు. లిక్కర్ కు బానిస అయిన మందుబాబులు గత్యంతరం లేక అధిక ధరలు పెట్టి ఆ మద్యం కోనుగోలు చేసి ఇంతకాలం తాగేశారు.

అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితులు మొత్తం తారుమారు కావడం, గత వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్లిపోవడం, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాత మద్యం పాలసీకి చెక్ పెడుతున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ వస్తుందని బుధవారం మంత్రి పార్థసారధి చెప్పారు. కొత్త మద్యం పాలసీతో పాటు పాత మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వస్తుందని మంత్రి పార్థసారధి క్లారిటీ ఇచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం షాపులు ప్రభుత్వమే నిర్వహించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వంలో మద్యం విక్రయాలు మొత్తం ప్రైవేటు చేస్తారా ?, ప్రభుత్వ లిక్కర్ షాపులు అలాగే కొనసాగిస్తారా ? అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం విక్రయాల్లో వేలకోట్ల రూపాయలు గోల్ మాల్ జరిగిందని, ప్రభుత్వ అధికారులు లిక్కర్ స్కామ్ లో భాగం అయ్యారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది.

కూటమి ప్రభుత్వం మీద ఇలాంటి ఆరోపణలు రాకుండా చూసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం కసరత్తులు చేస్తోందని తెలిసింది. మొత్తం మీద పాత మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తీసుకు వచ్చి కొత్త మద్యం పాలసీతో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకువస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ లోని మందుబాబులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications