చంద్రబాబు యూటర్న్, జగన్ హ్యాపీ: మళ్లీ మొదటికొచ్చిన రాజధాని కథ!

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కొత్తగా ప్రకటన విడుదల చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం బుధవారం నాడు కోర్టుకు తెలిపింది. ఏపీఐడీఈ చట్టాన్ని సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చామని, స్విస్ ఛాలెంజ్‌కు కొత్త ప్రకటన చేస్తామని చెప్పారు.

స్విస్ ఛాలెంజ్ విధానం నిర్మాణాన్ని తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని, అయినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లిందని, తీరా కోర్టు మొట్టకాయలు వేశాక యూ టర్న్ తీసుకుందని వైసిపి చెబుతోంది. ఓ విధంగా స్విస్ ఛాలెంజ్ విధానం జగన్‌కు ఊరటనిచ్చింది.

కొత్త నోటిఫికేషన్ ఇస్తాం: జగన్ దెబ్బకు 'రాజధాని'పై చంద్రబాబు యూటర్న్!

తాము మొదటి నుంచి పోరాడుతున్నా తగ్గలేదని, ఇప్పుడు న్యాయస్థానంలో తగ్గాల్సి వచ్చిందని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైసిపి ఎద్దేవా చేస్తోంది. ఇది టిడిపికి షాక్ కాగా, వైసిపికి ఊరట. ఇదిలా ఉండగా, స్విస్ ఛాలెంజ్ విధానంపై కొత్తగా ప్రకటన చేస్తామని చెప్పడంతో ఇది మళ్లీ మొదటికి వచ్చింది.

అమరావతిలో కేంద్ర రాజధాని ప్రాంతంలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి సీఆర్డీఏ స్విస్‌ఛాలెంజ్‌ విధానంలో మళ్లీ ఇంటర్నేషనల్ బిడ్లు పిలవనుంది. గత అనుభవాల దృష్ట్యా పక్కా నిబంధనలతో, సవరించిన ఏపీఐడీఈ అనుసరించి టెండరు ప్రక్రియ నిర్వహించనుంది.

Andhra Pradesh government’s U turn on Swiss Challenge method

రాజధానిలో 684 హెక్టార్లలో (6.84 చ.కి.మీ.) స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి సింగపూర్‌కు చెందిన అసెండాస్‌- సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్టియం స్విస్ ఛాలెంజ్‌ విధానంలో ఇచ్చిన ప్రతిపాదనను జులై 4న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.

ఏపీఐడీఈ చట్టం-2001 నిబంధనల ప్రకారం స్విస్ ఛాలెంజ్‌ విధానంలో సెప్టెంబర్‌ 1లోగా అంతర్జాతీయ బిడ్లు దాఖలు చేయాలని ఆహ్వానిస్తూ జులై 18న సీఆర్డీఏ టెండర్ ప్రకటన ఇచ్చింది. సింగపూర్‌ సంస్థల కన్సార్టియం ఒక సంయుక్త భాగస్వామ్య కంపెనీ (జేవీసీ)ని ఏర్పాటు చేస్తామని తెలిపింది.

ఈ జేవీసీ, రాజధాని నగర అభివృద్ధి, నిర్వహణ సంస్థ (సీసీడీఎంసీ)లు 58: 42 వాటాలతో ఒక స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ ఏర్పాటు చేస్తాయని పేర్కొంది. అయితే ఈ రెండు సంస్థల మధ్య ఆదాయ పంపిణీ వివరాలను వెల్లడించ లేదు. సీఆర్డీఏ ప్రకటనను సవాల్‌ చేస్తూ రెండు సంస్థలు హైకోర్టులో పిటిషన్లు వేశాయి.

స్విస్ ఛాలెంజ్‌ విధానంలో ప్రధానంగా నాలుగు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాటిలో ఆదాయ పంపిణీ విధానాన్ని బహిర్గతం చేస్తామని, అయితే సాంకేతిక బిడ్లకు అర్హత ఉన్న వారికే వివరాలు వెల్లడిస్తామని సీఆర్డీఏ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+