శుభవార్త: నిరుద్యోగులకు నెలకు రూ.3వేలపై చంద్రబాబు కీలక నిర్ణయం
ఏపీలో నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించారు. అలాగే కొన్ని ప్రయివేటు సంస్థలద్వారా ఉద్యోగాలను కల్పిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వ నోటిఫికేషన్లకు శ్రీకారం చుడుతూనే మరోవైపు వారికి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో వేదవిద్యను అభ్యసించిన నిరుద్యోగులకు ముందుగా రూ.3వేలు ఇవ్వాలని నిర్ణయిం తీసుకున్నారు. వీరికి సంబంధించిన వివరాలను పంపించాలటూ దేవాదాయశాఖ కమిషనర్ జిల్లాలవారీగా ఉన్న అధికారులకు ఈనెల 17వ తేదీన సర్క్యులర్ పంపించారు.
వేద విద్యనభ్యసించినవారితో..
రాష్ట్రవ్యాప్తంగా వేద విద్యనభ్యసించినవారు ఎంతమంది ఉన్నారు? నిరుద్యోగులుగా ఉన్నవారు ఎంత మంది? ఉద్యోగాలు పొందినవారు ఎంతమంది? ఉద్యోగాలు వస్తే వారు ఎక్కడ చేస్తున్నారు? వేతనం ఎంత? ప్రస్తుతం వేదవిద్యనభ్యసించినవారు వారి వారి కోర్సులు పూర్తిచేస్తే ఎంతమంది నిరుద్యోగులుగా బయటకు వస్తారు?.. తదితర వివరాలన్నింటినీ పంపించాలని అందులో పేర్కొన్నారు. వేదవిద్యను అభ్యసించేవారు తక్కువ సంఖ్యలోనే ఉంటారు కాబట్టి నిరుద్యోగ భృతి రూ.3వేలను వారితోనే ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

ప్రభుత్వంపైభారం
దీనివల్ల ప్రభుత్వంపై పెద్దగా భారం పడదనే ఆలోచనలో ఉంది. అయితే వివరాలన్నింటినీ క్రీడీకరించిన తర్వాత అర్హులెవరు? అనర్హులెవరు? అనే విషయంలోనే అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఖజాలా ఖాళీగా ఉండటంతోపాటు ప్రభుత్వ ఆస్తులన్నీ భవనాలతో సహా తాకట్టు పెట్టివుండటంతో చంద్రబాబు షాక్ తిన్నారు. దీంతో వీరికి ఏవిధంగా నిరుద్యోగ భృతి అందించాలా? అనే యోచనలో ఉన్నారు. నిరుద్యోగుల కోసం యువనేస్తం పథకాన్ని అమలు చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. అది ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో అని నిరుద్యోగులంతా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications