అమరావతి సిద్ధం: సిడ్నీ ప్రత్యేక పూజలు, చిహ్నం రూపకల్పనపై సమాలోచనలు
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి సంబంధించిన పనులన్నీ చకాచకా జరిగిపోతున్నాయి. తాజాగా అమరావతికి సంబంధించి చిహ్నం రూపకల్పనపై ఏపీ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇందుకు గాను రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లతో పురపావలక శాఖ మంత్రి నారాయణ ఆదివారం సమావేశమయ్యారు.
విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి నాగార్జున, శ్రీవెంకటేశ్వర, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీల నుంచి సుమారు 30 మంది ప్రొఫెసర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరావతి చిహ్నం రూపకల్పనపై మంత్రి ప్రొఫెసర్లతో చర్చించారు.
రాజధాని నిర్మాణంలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా చేపట్టనున్న నిర్మాణాల కోసం డిజైన్ల రూపకల్పనతో పాటు మొదలైన విషయాలను మంత్రి నారాయణ ప్రొఫెసర్లతో ప్రస్తావించారు. మరోవైపు అక్టోబర్ 22న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది.

దీని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు కమిటీలను వేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు అమరావతి నిర్మాణం కోసం తలపెట్టిన శంకుస్థాపన కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలూ రాకూడదని ఆస్రేలియా ప్రముఖ నగరం సిడ్నీలో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజధానికి మంచి కంపెనీలు వచ్చి, యువతకు ఉద్యోగాలు రావాలని కోరుతూ నవధాన్యాలు నింపిన కలశాలకు పూజలు జరిపారు. దీన్ని శంకుస్థాపన నాటికి అమరావతికి తీసుకురానున్నామని వెల్లడించిన సిడ్నీ తెలుగు వాసులు, ఏపీ రాజధాని నిర్మాణానికి శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
నిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఉన్న మంత్రి నారాయణ ఇప్పటికే తన పనిని ప్రారంభించారు. ఈ కమిటీలో మంత్రి నారాయణంతో పాటు సభ్యులుగా వ్యవసాయ, నీటివనరుల మంత్రి, సమాచార మంత్రి, ఆరోగ్య మంత్రి, ఎంపి గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ఉన్నారు.

ఇక ఆహ్వాన కమిటీకి కృష్ణా జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. సభ్య కన్వీనర్‌గా ప్రోటోకాల్ శాఖ జాయింట్ సెక్రటరీ, గుంటూరు జాయింట్ కలెక్టర్, సిఆర్‌డిఎ అదనపు కమిషనర్, ఈవెంట్ మేనేజిమెంట్ సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉన్నారు.
వేదిక కమిటీకి కృష్ణా జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. సభ్యులుగా డిజిపి, ఆర్ అండ్ బి ఎస్‌ఇ, నీటి వనరుల శాఖ ఎస్‌ఇ, పిఆర్ శాఖ ఎస్‌ఇ, గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఇ, సమాచార శాఖ అదనపు డైరెక్టర్, ఈవెంట్ మేనేజిమెంట్ ప్రతినిధి , గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఉన్నారు.
మీడియా కమిటీకి పరకాల ప్రభాకర్ చైర్మన్‌గా ఉన్నారు. సభ్యులుగా యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యదర్శి, కార్యదర్శి, సమాచార శాఖ డైరెక్టర్, ఆర్కియాలజీ మాజీ డైరెక్టర్ శివనాగిరెడ్డి, ఈవెంట్ మేనేజిమెంట్ ప్రతినిధి, ఆర్కివ్స్ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు.
రాజధాని అమరావతిలో రెండు ఐకాన్ టవర్లు, వాటర్ ఫ్రంట్, వాటి ఎదురుగా సువిశాలమైన నిట్టనిలువు రహదారి, 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగే శంకుస్థాపన ప్రదేశం చారిత్రాత్మక పర్యాటక ప్రాంతంగా వెయ్యేళ్లపాటు నిలిచిపోవాలని శనివారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సిఆర్‌డిఏ సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
రాజధానిలో మూడు రీజియన్ కేంద్రాల మధ్య, తొమ్మిది క్వీన్ సిటీల నిర్మాణం పకడ్బందీగా, పర్యావరణహితంగా జరగనుంది. టూరిజం సిటీ, హెల్త్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, జస్టిస్ సిటీ, కల్చరల్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫైనాన్స్ సిటీల నిర్మాణం ఎప్పటికీ నిత్య నూతనంగా నిలిచిపోనుంది.
అదే విధంగా అమరావతికి పేరొచ్చేలా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో ఇండియా గేట్, ముంబయిలో గేట్ వే ఆఫ్ ఇండియా, హైదరాబాద్‌లో చార్మినార్ తరహాలో ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసే ప్రాంతం వేల సంవత్సరాలపాటు చరిత్రలో నిలిచిపోయేలా రాజధానిని నిర్మించనున్నారు. రోడ్లు వంకరటింకరగా ఉంటే భూమి విలువ పెరగదని, అందుకే స్థానికులను సంప్రదించి రోడ్ల ప్రణాళిక కూడా రూపొందించారు.
సమీపంలోని వాణిజ్య కూడలికి ఐదు నిముషాల్లో చేరుకునేలా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలను రూపొందించారు. భవిష్యత్ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని రోడ్లు, కూడళ్ల అభివృద్ధి జరగాలన్నారు. 29 గ్రామాల్లో ఎన్ని బ్లాకులు వస్తాయి, ఎన్ని గ్రిడ్లు అభివృద్ధి చేయవచ్చో సమగ్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications