శాసన మండలి రద్దు బిల్లు కూడా వెనక్కి?: వైఎస్ జగన్ బిగ్ స్కెచ్
అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో వరుసగా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు అంశం.. వెనక్కి వెళ్లింది. మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ రెండు సంవత్సరాలుగా అమరావతి ప్రాంత రైతులు నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, ఏపీ హైకోర్టులో ఈ బిల్లులకు సంబంధించి సుదీర్ఘంగా కొనసాగుతోన్న విచారణలు, న్యాయపరమైన చిక్కులు..వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇవ్వాళ మండలిలో..
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ రద్దు బిల్లులను ఉపసంహరించుకోనున్నట్లు సభలో ప్రకటన చేశారు. సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సుదీర్ఘంగా చర్చించిన అనంతరం బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇవే ప్రతిపాదనలు ఇవ్వాళ శాసన మండలి సమక్షానికి రానుంది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దీన్ని ప్రవేశపెడతారు. వెనక్కి తీసకోవడానికి గల కారణాలను మండలికి వివరిస్తారు.

కౌన్సిల్ రద్దు బిల్లు కూడా వెనక్కి..
కాగా- ఇదే వేగంతో వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే- శాసన మండలి రద్దు బిల్లును కూడా ఉపసంహరించుకోవడం. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లును అడ్డుకున్న కారణంతో అప్పట్లో వైఎస్ జగన్ మండలిని రద్దు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడా మూడు రాజధానుల ఏర్పాటు బిల్లునే వెనక్కి తీసుకున్నందున.. దానికి అనుగుణంగా శాసన మండలి రద్దు బిల్లును సైతం ఉపసంహరించుకోవాలని వైఎస్ జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై కసరత్తు పూర్తి చేశారని, ఈ బిల్లుకు సభలో ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

రాజకీయంగా వైసీపీకే లబ్ది..
శాసన మండలిలో ఉన్న స్థానాల సంఖ్య 58. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఇక్కడ.. ప్రతిపక్ష స్థానంలో ఉండేది. 29 సభ్యులతో తెలుగుదేశం పార్టీ అధికార పక్షంగా ఉండేది. మెజారిటీ సభ్యులు టీడీపీ వైపు ఉండటం వల్ల మూడు రాజధానుల బిల్లును ఆమోదింపజేసుకోవడం సాధ్యం కాలేదు అప్పట్లో. దీన్ని సెలెక్షన్ కమిటీకి పంపించింది మండలి. ఈ రెండున్నరేళ్ల కాలంలో శాసన మండలిలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. మొదట్లో ప్రతిపక్ష స్థానంలో ఉన్న వైఎస్ఆర్సీపీ.. ఇప్పుడు అధికార పక్షంగా మారింది. ఆ పార్టీకి ఇప్పుడు మెజారిటీ సభ్యులు ఉన్నారు.

వైసీపీకి మెజారిటీ సభ్యులు..
ప్రస్తుతం శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకి ఉన్న సభ్యుల సంఖ్య 18. ఈ సంఖ్య మరింత పెరగబోతోంది కూడా. వైసీపీకి చెందిన 14 మంది శాసన మండలికి ఎన్నిక కానున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల కోటా, మిగిలిన 11 మంది స్థానిక సంస్థల కోటా కింద శాసన మండలికి వెళ్లనున్నారు. దీనితో వైఎస్ఆర్సీపీ బలం 32కు చేరుకుంటుంది. రాష్ట్రానికి, ప్రజల ప్రయోజనం కోసం అధికార పక్షం ప్రవేశపెట్టే ఎలాంటి బిల్లులైనా గానీ.. ఇప్పుడు శాసన మండలి ఆమోదం పొందడం లాంఛనప్రాయమే. పూర్తిస్థాయి మెజారిటీని సాధించినందున మండలిని రద్దు చేయాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ భావిస్తున్నారు. దీన్ని కార్యరూపంలోకి పెట్టనున్నారు.
Recommended Video

నేడో రేపో.. బిల్లు..
శాసన మండలిని రద్దు చేయడానికి ఉద్దేశించిన బిల్లును కూడా వెనక్కి తీసుకుంటూ రూపొంచిందిన ప్రతిపాదనలను నేడో, రేపో అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దీన్ని ప్రవేశపెడతారు. శాసన మండలిని రద్దు చేసే నిర్ణయం నుంచి ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చిందనే విషయాన్ని సభకు వివరిస్తారు. అనంతరం సభామోదం పొందుతారు. దీనిపై ఓ తీర్మానాన్ని కూడా ఆమోదిస్తుందని, దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ మరుసటి రోజే ఇదే బిల్లు మండలి సమక్షానికి వస్తుంది.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications