వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేలు పార్టీ మారటం వెనుక ఐఏఎస్‌లు, బాగోతం బయటపెడ్తా: విజయసాయి మరో బాంబు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Vijay Sai Reddy Says I Have Proofs Against IAS, IPS Officers

అమరావతి: ఐఏఎస్ అధికారులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి గురువారం అన్నారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అధికార టీడీపీలో చేరడం వెనుక వారి హస్తముందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

'విజయసాయి వల్లే జైలుకు జగన్, అలా చెప్తే తప్పేంటి.. ఓటుకు నోటులో బాబు పాత్ర లేదు''విజయసాయి వల్లే జైలుకు జగన్, అలా చెప్తే తప్పేంటి.. ఓటుకు నోటులో బాబు పాత్ర లేదు'

ఐఏఎస్ అధికారులు సతీష్ చంద్ర, రాజమౌళి, సాయిప్రసాద్, ఐజీ వెంకటేశ్వర రావు తమ బాధ్యతలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. సరైన సమయంలో ఆధారాలతో సహా ఐఏఎస్‌ల బాగోతం బయటపెడతానని బాంబు పేల్చారు.

 వాళ్లు ఎంతవరకు వెళ్తే అంతదాకా

వాళ్లు ఎంతవరకు వెళ్తే అంతదాకా

తన వ్యాఖ్యలను టీడీపీ నేతలు, ఐఏఎస్ అధికారులు ఖండించడంపై విజయ సాయి రెడ్డి తీవ్రంగానే స్పందించారు. అధికారులు ఎంత వరకు వెళ్లినా పర్వాలేదని, తాను అంతవరకు వెళ్ళేందుకు సిద్ధమని అభిప్రాయపడ్డారు.

సతీష్ చంద్ర అంతుచూస్తామనడం బాధాకరం

సతీష్ చంద్ర అంతుచూస్తామనడం బాధాకరం

సీఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రపై, ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వర రావులపై విజయసాయి రెడ్డి చేసిన విమర్శలపై రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం ఇదివరకే ఖండించింది. తాము అధికారంలోకి వస్తే సతీష్ చంద్ర సంగతి చూస్తామని హెచ్చరించడం బాధ్యతారాహిత్యమని సంఘం రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

మనోధైర్యం దెబ్బతీసేలా మాట్లాడవద్దు

మనోధైర్యం దెబ్బతీసేలా మాట్లాడవద్దు

కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సతీష్ చంద్ర నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని, అమరావతి నుంచి పాలన సాగేలా తగిన ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారని శశిభూషణ్ కుమార్ తెలిపారు. అనేక సవాళ్లతో లక్ష్యాలను సాధించేందుకు శ్రమిస్తున్న సివిల్ సర్వీస్ అధికారుల మనోధైర్యం దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు.

 సోమిరెడ్డి ఆగ్రహం

సోమిరెడ్డి ఆగ్రహం

విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. 11 అవినీతి కేసుల్లో రెండో ముద్దాయిగా ఉ్నన వ్యక్తి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారులు పిలిస్తే పరుగెత్తే అసమర్థులా మీ ఎమ్మెల్యేలు, వైయస్ హయాంలో 12 మంది ఐఏఎస్‌లు జగన్ స్వార్థానికి కేసుల్లో ఇరుక్కున్నారని మండిపడ్డారు. కోర్టు బోనుల్లో వారు నిలబడాల్సి వచ్చిందన్నారు.

 ప్రభుత్వం వెనుకాడదు

ప్రభుత్వం వెనుకాడదు

అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయ సాయి రెడ్డి వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని మంత్రి కాల్వ శ్రీనివాసులు వేరుగా డిమాండ్ చేశారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధఅవజమెత్తారు. విజయసాయిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడదన్నారు.

English summary
The Andhra Pradesh IAS Officers Association has taken strong exception to the threats allegedly held out by YSRCP MP, V. Vijay Sai Reddy against a senior IAS officer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X