వ్యాక్సినేషన్‌లో అట్టడుగున ఏపీ-తాడేపల్లి కొంపలో ముడుచుకుని పడుకున్న జగన్ ఇక నిద్ర లేవండి : లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యాక్సినేషన్ విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉందని.. ఇకనైనా సీఎం జగన్ మేల్కొనాలని సూచించారు. ఈ మేరకు వరుస ట్వీట్లతో లోకేశ్ జగన్‌పై విరుచుకుపడ్డారు.

'జగన్ రెడ్డి గారి పాలన వల్ల అధోగతిలో అగ్రస్థానం.. ప్రగతిలో చిట్టచివరి స్థానంలో ఉంది రాష్ట్రం. ఎవరెలా చస్తే నాకేంటి తాడేపల్లి కొంపలో నేను హాయిగా నిద్రపోతే చాలు అన్నట్టు ఉంది వైఎస్ జగన్ గారి వ్యవహార శైలి.థర్డ్ వేవ్ హెచ్చరికలతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై, వ్యాక్సినేషన్ వేగవంతం చేసాయి. మన రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన వారికి ఒక్క డోసు 40 శాతం, రెండు డోసులను 16 శాతం మందికి వేసి దేశంలోనే అట్టడుగుస్థానంలో ఉంది. కులపిచ్చతో వ్యాక్సిన్ కంపెనీపై ఏడ్చే బదులు... వచ్చిన వ్యాక్సిన్ వృథా కాకుండా వేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. మాస్కుతో మొఖం తుడుచుకొని, తాడేపల్లి కొంపలో ముడుచుకొని పడుకున్న జగన్ రెడ్డి గారు నిద్రలేవండి. థర్డ్ వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపనుందనే హెచ్చరికలపై మేల్కొనండి.' అని లోకేశ్ దుయ్యబట్టారు.

andhra pradesh is at bottom in terms of vaccination nara lokesh criticises cm jagan

ఇప్పటివరకూ దేశంలో సింగిల్ డోస్ వ్యాక్సినేషన్‌లో కేవలం 40శాతంతో ఆంధ్రప్రదేశ్,నాగాలాండ్ అట్టడుగు స్థానంలో ఉన్నాయి.దక్షిణాదిలో ఏపీనే అట్టడుగు స్థానంలో ఉంది.ఈ నేపథ్యంలో ఆ ఇన్ఫోగ్రాఫిక్స్ ట్విట్టర్‌లో షేర్ చేసిన లోకేశ్ సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. గతంలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కంపెనీకి సంబంధించి సీఎం జగన్ పరోక్షంగా కుల ప్రస్తావన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అది టీడీపీ అధినేత చంద్రబాబు బంధువులది అని వ్యాఖ్యానించారు. అక్కడ ఏం జరుగుతుందో తెలిసి కూడా ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు ప్రతిపక్ష నేతలు చేస్తున్నారని అప్పట్లో విమర్శించారు. ఇదే విషయాన్ని తాజాగా లోకేశ్ తన ట్వీట్‌లో పరోక్షంగా ప్రస్తావించారు.

లోకేశ్ ఏపీ సర్కార్‌పై విమర్శల విషయంలో ఈమధ్య దూకుడు పెంచినట్లే కనిపిస్తోంది.నిన్నటికి నిన్న వైసీపీ శ్రేణులను ఆయన తాలిబన్లతో పోల్చారు. తాలిబన్ల తాతల్లా తయారయ్యారు వైసీపీబన్లు అంటూ విమర్శించారు. తాలిబన్లు నల్లమందును ఒక్కటే పండిస్తారని.. వైసీపీబన్ల పాలనలో సారా తయారీ నుంచి మొదలై నాటు తుపాకుల ఉత్పత్తి కేంద్రంగా మార్చేశారని ధ్వజమెత్తారు.చంద్రబాబు నెల‌కొల్పిన‌ మెడ్‌టెక్‌ జోన్‌లో క‌రోనా కిట్లు మేక్ ఇన్ ఆంధ్రా అయితే జ‌గ‌న్ విధ్వంస‌క పాల‌న‌లో ఫ్యాక్షన్‌ కిట్లు మేడ్ ఇన్ ఆంధ్రా అయ్యాయని విమర్శించారు. పశ్చిమ గోదావరి నాటు తుపాకులు తయారుచేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయడంతో లోకేశ్ దాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టి విమర్శలు చేశారు.

Recommended Video

    NTR ని TDP నుండి సస్పెండ్ చేసి.. ఇప్పుడు నాటకాలా.. Vijaysaireddy మాస్ ట్రోలింగ్ || Oneindia Telugu

    మరోవైపు,లోకేశ్ విమర్శలపై తెలుగు-సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి తీవ్ర స్థాయిలో స్పందించారు. లోకేశ్‌.. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తాట తీస్తామని హెచ్చరించారు. సీఎం జగన్‌పై లోకేశ్‌ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, టీడీపీకి భవిష్యత్తు లేదన్న భయాందోళనలే ఆయనతో ఇలా మాట్లాడిస్తున్నాయన్నారు. లోకేశ్‌ భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+