నేడే డీఎస్సీ మెరిట్ లిస్ట్.. నమ్మొద్దంటూ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లోని టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల కాగా, తదుపరి కీలక ప్రక్రియ మొదలైంది. మొత్తం 16,347 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెరిట్ లిస్ట్ను అధికారులు ఈరోజు(శుక్రవారం) తేదీన విడుదల చేయనున్నారు.
ఈ జాబితా జిల్లా వారీగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు తమ ర్యాంకును చూసుకోవచ్చు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అయితే, ఈ సమయంలో టీచర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, డబ్బులు వసూలు చేసే దళారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఇలాంటి వదంతులు సృష్టించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా, అధికారిక వెబ్‌సైట్‌లో వచ్చే సమాచారం మాత్రమే నమ్మాలని కోరారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications