మంత్రి అచ్చెన్నాయుడుపై అవినీతి ఆరోపణలు.. అధికారి లేఖతో మొత్తం బట్టబయలు

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి అచ్చెన్నాయుడుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ఆగ్రోస్‌ జనరల్ మేనేజర్ రాజమోహన్ బదిలీ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి సహకరించలేదనే కోపంతోనే రాజమోహన్‌పై కక్షకట్టారని, దీని వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని వైసీపీ ఆరోపిస్తుంది.

వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలని మంత్రి పేషీ నుంచి జీఎం రాజమోహన్‌పై తీవ్ర ఒత్తిడి వచ్చిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, రాజమోహన్ ఈ అవినీతికి సహకరించడానికి నిరాకరించడంతో, ఆగమేఘాలపై అతన్ని నెల్లూరుకు బదిలీ చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ బదిలీకి అర్హత లేని, గతంలో అవినీతి ఆరోపణలున్న ఒక జూనియర్ అధికారిని జీఎం పోస్టులో నియమించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Andhra Pradesh Minister Atchannaidu Accused of Corruption Officer Transferred for Refusing to Cooperate
తనకు జరిగిన అన్యాయంపై రాజమోహన్ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక లేఖ రాశారు. ఈ అడ్డగోలు దోపిడీకి సహకరించలేదని తనను ఇలా బదిలీల పేరుతో వేధిస్తున్నారని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.సెలవుపై వెళ్లడం తప్ప తనకు మరో మార్గం లేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై ప్రతిపక్ష వైసీపీ అధికార కూటమిని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. "ఇదేనా మంచి ప్రభుత్వం? ఇదేనా నిజాయితీ?" అంటూ వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణలపై మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త వివాదానికి తెర తీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+