ఫస్ట్...జగన్ ను దేశ బహిష్కరణ చెయ్యండి, గొట్టిపాటి గట్టి కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ కు ఆ రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. భారతదేశ సంప్రదాయాలని గౌరవించకపోతే జగన్ ను దేశం నుండి బహిష్కరించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం కల్పించిన అవకాశాలు మొత్తం జగన్ సద్వినియోగం చేసుకున్నారని, ఆయన ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చారో అందరికీ తెలుసని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

మన ప్రజాస్వామ్యం కల్పించిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకున్న జగన్ సీఎం స్థాయికి ఎదిగారని, ఇప్పుడు అదే ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ఇంతకాలం ఆయన దేశ సంపదను కొల్లగొట్టారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశ సాంప్రదాయాల కించపరుస్తున్న వైసీపీ అధినేత జగన్ ను వెంటనే భారతదేశం నుండి బహిష్కరించాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు.

Andhra Pradesh minister demanded Jagan s expulsion from the country

మనం ఏ దేశంలో ఉన్నామో మొదట తెలుసుకోవాలని, ఇక్కడి సాంప్రదాయాలకు మనం గౌరవించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాజీ సీఎం జగన్ కు సూచించారు. భారతదేశం అంటే హిందూ సాంప్రదాయాలు మాత్రమే కాదని, ముస్లిం, క్రిస్టియన్ సోదరుల సాంప్రదాయాలను మనమందరం గౌరవించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దేశ సంప్రదాయాలను గౌరవించలేని వాళ్లు దేశానికి, ప్రజలకు ఏం సేవ చేస్తారని, జగన్ మాటలు వింటుంటే ఐదు సంవత్సరాలు ఆయన ప్రజలకు ఎలాంటి సేవ చేశారో అర్థం అవుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యంగంగా అన్నారు.

ఇదేనా మీరు దేశానికి ఇచ్చే గౌరవం అని మాజీ సీఎం జగన్ ను, వైసీపీ నాయకులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. మనం ఎలాంటి దేశంలో బతుకుతున్నామో అర్థం చేసుకోవాలని జగన్ చేసిన ఆరోపణలను మంత్రి రవికుమార్ ఖండించారు. ఇన్ని సంవత్సరాలు ఏ దేశంలో బతికాడో జగన్ కే తెలీదా అని గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. జగన్ వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసం మనం ఏ దేశంలో బతుకుతున్నాయో అనే సంచలన వ్యాఖ్యలు చేశారని, మొదట ఆ వ్యాఖ్యలను జగన్ ఉపసంహరించుకోవాలని మంత్రి గొట్టిపాటి డిమాండ్ చేశారు.

Andhra Pradesh minister demanded Jagan s expulsion from the country

జగన్ తన రాజకీయ లబ్ధి కోసం భారతీయ సాంప్రదాయాలను, మత విశ్వాసాలను కించపరచడం చాలా బాధాకరమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విచారం వ్యక్తం చేశారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అనడంతో జగన్ హిందూ సాంప్రధాయాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని, ఆయన ఆరోపణలకు వైసీపీ నాయకులు వంతపాడుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విరుచుకుపడ్డారు.

జగన్ ను వెంటనే దేశం నుండి బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అధికారం అడ్డం పెట్టుకుని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మా నాయకుడు జగన్ ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేదిలేదని వైసీపీ నాయకులు హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+