ఏపీలో కొత్త మంత్రులకు ఛాంబర్ల నిర్మాణం ఆలస్యానికి కారణమిదే

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పునర్వవ్యవస్థీకరించి దాదాపుగా 24 రోజులు దాటింది.అయితే కొత్త మంత్రులకు ఇంకా ఛాంబర్లు కేటాయించలేదు. ప్రస్తుతమున్న సమావేశ మందిరాల్లోనే మంత్రులకు ఛాంబర్లను సిద్దం చేస్తున్నారు.అయితే బాత్ రూమ్ ల నిర్మాణం పూర్తైతేనే మంత్రుల చాంబర్లు సిద్దం కానున్నాయి. మంత్రులకు ఛాంబర్లు సిద్దం కావడానికి ఇంకా 20 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది.

ఈ నెల 2వ, తేదిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించారు.మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ కారణంగా నలుగురు మంత్రులకు ఉద్వాసన చెప్పారు. మరో 11 మంది కొత్తవారికి చోటు కల్పించారు.

అయితే కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కినవారిలో అత్యధికులకు ఛాంబర్లు లేవు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కూడ కొందరు మంత్రులు సమావేశ మందిరాల్లోనే బాధ్యతలను స్వీకరించారు.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మంత్రులకు ఛాంబర్లు త్వరగా ఏర్పాటు చేయాలని సిఏంఓ ఆదేశించింది.అయితే ఈ పనులు పూర్తి కావడానికి ఇంకా పదిరోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది.

సమావేశ మందిరాలే మంత్రులకు ఛాంబర్లు

సమావేశ మందిరాలే మంత్రులకు ఛాంబర్లు

మంత్రివర్గ విస్తరణ జరిగి 24 రోజులు దాటింది. కాని, ఇంకా కొత్త మంత్రులకు ఛాంబర్ల కేటాయించలేదు. అయితే సచివాలయంలో ఉన్న సమావేశమందిరాలనే మంత్రులకు ఛాంబర్లుగా కేటాయించే పనులు సాగుతున్నాయి. సమావేశమందిరాలనే విడగొట్టి మంత్రులకు చాంబర్లుగా మారుస్తున్నారు. మంత్రుల ఛాంబర్, యాంటీరూమ్, ఓఎస్ డీ, పీఎస్ లు, సందర్శకులకు వెయిటింగ్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక మీటింగ్ హాల్ ను ఐదారు గదులుగా మారుస్తున్నారు.

బాత్ రూమ్ ల కారణంగానే ఆలస్యమా?

బాత్ రూమ్ ల కారణంగానే ఆలస్యమా?

మంత్రుల ఛాంబర్ల ఏర్పాటు కోసం గోడలు నిర్మించడంలేదు. తాత్కాలికంగా సమావేశమందిరాల్లోనే మంత్రులకు చాంబర్లు కేటాయిస్తున్నందున జిప్సం బోర్డులు పెట్టి పార్టిషన్లు నిర్మిస్తున్నారు. ఈ పని త్వరగానే పూర్తవుతోంది.అయితే సమావేశ మందిరాల్లో బాత్ రూమ్ లో లేవు.అయితే బాత్ రూమ్ లు నిర్మించకపోతే మంత్రులకు ఛాంబర్లు కేటాయించి కూడ ప్రయోజనం ఉండదు.కనీసం మంత్రికి కేటాయించిన యాంటీ రూమ్ లో బాత్ రూమ్ ను నిర్మిస్తున్నారు. ఈ పనుల కారణంగానే పనులు ఆలస్యమౌతున్నాయని చెబుతున్నారు అధికారులు.

పనుల ఆలస్యానికి కారణమిదే

పనుల ఆలస్యానికి కారణమిదే

మంత్రుల చాంబర్లలో బాత్ రూమ్ లు, మరుగుదొడ్లు నిర్మించాలంటే ఇటుక గోడలతో కట్టాల్సి ఉంది. దీని కోసం గోడలు కట్టడం, బాత్ రూమ్ పైపలు వేయడం, మళ్ళీ టైల్స్ వేయడం , వాటర్ ప్రూపింగ్ చేసి రంగులు వేయడానికి అధిక సమయం పడుతోంది. మరో వైపు సమావేశ మందిరాల్లో ఉన్న ఫర్నీచర్ ను మైక్ లను తొలగించాలంటే ప్రభుత్వ ఉత్తర్వులు అవసరం. అవి వచ్చేదాకా వేచిచూడాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు.

సీఆర్ డి ఏ ప్లాన్ పై మంత్రుల సూచనలు

సీఆర్ డి ఏ ప్లాన్ పై మంత్రుల సూచనలు

మంత్రులకు ఏ బ్లాక్ లో ఏ గది కేటాయించేది తేలిపోయింది. తమకు ఇష్టమైన ఇంటీరియర్ ను చేయించుకొంటున్నారు మంత్రులు. సీఆర్ డి ఏ అధికారులు ఇచ్చిన ప్రణాళికలో తమకు అవసరమైన మార్పులు, చేర్పులు సూచిస్తున్నారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి లోకేష్ తన ఛాంబర్ ను జిప్సం బోర్డులతో కాకుండా గ్లాస్ పార్టిషన్ చేయాలని సూచించారు. గుంటూరులో పార్టీ కార్యాలయంలో ఉన్నట్టుగానే తన చాంబర్ కు పార్టిషన్ ను చేయాలని ఆయన సూచించారని సమాచారం. మంత్రుల ఛాంబర్లు వేగంగా పూర్తయ్యేందుకు ఒక్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను కేటాయించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra pradesh new minsters chambers will ready after 10 days. Government allotted for one executive officer for constructing new chambers.temporary arrangements made for chambers

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి