విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తీరం దాటిన ‘దాయే’ తుపాను...ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్షం హెచ్చరిక:వాతావరణశాఖ రెడ్ మెస్సేజ్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం:దాయో తుపాన్‌ శుక్రవారం ఉదయం కళింగపట్నం, పూరిల మధ్య తీరం దాటింది. తుపాన్‌ ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాలో భారీ వర్షాలు పడుతున్నాయి. భవానీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 130 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతం అయింది.

దాయే తుపాను క్రమంగా బలహీనపడి తీవ్రవాయుగుండంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అతి భారీ వర్షాలు...కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అటు తెలంగాణ, రాయలసీమల్లో కూడా విస్తారంగా వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను కారణంగా బలమైన గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Andhra Pradesh, Odisha put on high alert after Daye cyclone warning

దాయే తుపాను గురువారం రాత్రి కళింగపట్నం-పూరి మధ్య తీరం దాటినట్లు విశాఖపట్టణం వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది వాయువ్య దిశగా పయనించి గోపాల్‌పూర్‌లో 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయానికి ఇది భవానిపట్నానికి తూర్పు ఆగ్నేయదిశగా
130 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతం అయి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో వాతావరణశాఖ రెడ్‌ మెస్సేజ్‌ విడుదల చేసింది. సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని, అలలు సాధారణంకంటే మీటరు ఎత్తు వరకు ఎగసి పడతాయని తెలిపింది. విశాఖపట్నం, గంగవరం, కళింగపట్నం, భీమునిపట్నం పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

దాయే తుఫాన్‌ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో ఒడిశాలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమ తెలంగాణలో కూడా ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తుపాను ప్రభావంతో చెట్లు, ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, రోడ్లు దెబ్బతింటాయని, తీరం వెంబడి ఉన్న లోతట్టు ప్రాంతాలను సముద్రపు నీరు ముంచెత్తే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.

English summary
Visakhapatnam: The cyclonic storm “DAYE” over south Odisha and neighbourhood moved west-northwest wards during past six hours with a speed about 26 kmph and weakened into a Deep. Depression and lay centred at 0530 hrs IST of today, the 21 th September, 2018 over south interior.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X