రాష్ట్రాన్ని కమ్మేసిన కౌంటింగ్ మేనియా!
Recommended Video
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలను, ఆ మాటకొస్తే దేశం మొత్తాన్నీ కౌంటింగ్ మేనియా కమ్మేసింది. మరి కొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దేశ ప్రజలందరిలోనూ తీవ్ర ఉత్కంఠత నెలకొంది. సుమారు 90 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు జనం. గురువారం సాయంత్రానికల్లా రాజు ఎవరో, బంటు ఎవరో తేలిపోతుంది.
రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. సూక్ష్మ పరిశీలకులు సహా కౌంటింగ్ సిబ్బందికి మూడువారాలుగా దశలవారీగా శిక్షణ ఇస్తూ వచ్చారు. ఒక్క ఓటు తేడా వచ్చినా, ఫలితాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉండటంతో కౌంటింగ్ సిబ్బందికి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై అవగాహన కల్పించారు. వారి అనుమానాలను నివృత్తి చేశారు. జిల్లా రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తోన్న కలెక్టర్ నేతృత్వంలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరింపజేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద మోహరింపజేసిన బలగాల కంటే అధిక భద్రతను కౌంటింగ్ సెంటర్లకు కల్పించింది.
అనంతపురం జిల్లాలో 4000 మంది సిబ్బంది..
అనంతపురం జిల్లాలో అనంతపురం, హిందూపురం లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాల కోసం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ వీరపాండియన్ బుధవారం పర్యవేక్షించారు. మొత్తం నాలుగు వేల మంది సిబ్బందిని కౌంటింగ్ కోసం నియమించినట్లు చెప్పారు.

లోక్‌సభ కోసం 16, అసెంబ్లీ కోసం 30 టేబుళ్లు
కడప జిల్లాలో కడప, రాజంపేట లోక్‌సభ స్థానాల కోసం 16 టేబుళ్లు, 10 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను లెక్కించడానికి 30 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సీ హరికిరణ్ తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. అధికారులు, కౌంటింగ్ సిబ్బందికి సూచలను జారీ చేశారు. గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం జిల్లాలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాలను ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో చేపట్టారు. జిల్లాలోని 15 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలకు పోలైన ఓట్లను లెక్కించేందుకు 420 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో కర్నూలు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల కౌంటింగ్‌ను జీ పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు రాయలసీమ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఓట్ల లెక్కింపును స్థానిక శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications