వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సహకరించకపోతే మార్కులు కట్: లైంగిక వేధింపులపై ఎస్వీ విద్యార్ధినుల ఫిర్యాదు

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుపతి రుయా చిన్న పిల్లల ఆసుపత్రిలో వైద్యులు తమను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారని పీజీ విద్యార్ధినులు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గవర్నర్‌ నరసింహన్‌కు లేఖ రాశారు. తాము చెప్పినట్టు వినకపోతే ప్రాక్టికల్‌లో మార్కులు వేయమని బెదిరిస్తున్నారని విద్యార్ధినులు ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుపతి రుయా చిన్న పిల్లల ఆసుపత్రిలో కొందరు వైద్యుల తీరుపై పీజీ విద్యార్ధినులు గవర్నర్ నరసింహన్ కు లేఖ రాయడం తీవ్ర కలకలం రేపుతోంది. కొంతకాలంగా ఆసుపత్రిలోని కొన్ని విభాగాల్లో ఈ తరహ వేధింపులు కొనసాగుతున్నాయని పీజీ విద్యార్ధినులు గవర్నర్‌కు లేఖ రాశారు.

ఆత్మహత్య చేసుకోవాలని భావించి చివరి క్షణంలో ఆగిపోయినట్టు కూడ కొందరు పీజీ విద్యార్ధినులు గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ ఉదంతం ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

పీజీ విద్యార్ధినులపై లైంగిక వేధింపులు

పీజీ విద్యార్ధినులపై లైంగిక వేధింపులు

తిరుపతి రుయా చిన్న పిల్లల ఆసుపత్రిలో వైద్యుల తీరుపై పీజీ విద్యార్ధినులు గవర్నర్ నరసింహన్ కు లేఖ రాశారు. తాము ధరించే దుస్తులు, శరీర సౌష్టవం గురించి కొందరు వైద్యులు కామెంట్లు చేస్తున్నారని విద్యార్ధినులు గవర్నర్ నరసింహన్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు. తమను వేధింపులకు గురిచేస్తున్న వైద్యుల పేర్లను కూడ వారు ఆ లేఖలో ప్రస్తావించారు.తమకు న్యాయం చేయాలని పీజీ విద్యార్ధినులు గవర్నర్ ను ఆ లేఖలో కోరారు.

ఆత్మహత్య చేసుకొవాలని భావించా

ఆత్మహత్య చేసుకొవాలని భావించా

తాను వివాహితనని ఓ విద్యార్ధిని గవర్నర్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు. తన పట్ల పీడియాట్రిక్స్ విభాగంలోని కొందరు ప్రోఫెసర్లు అసభ్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. ఆ వేధింపులను తట్టుకోలేక తీవ్రంగా మనస్థాపానికి గురైనట్టు ఆమె చెప్పారు. ఈ వేధింపులను భరించలేకపోతున్నానని చెప్పారు. కొన్ని సమయాల్లో ఆత్మహత్య కూడ చేసుకోవాలని నిర్ణయించుకొన్నానని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.

ప్రాక్టికల్ లో మార్కులు కట్

ప్రాక్టికల్ లో మార్కులు కట్

తాము చెప్పినట్టుగా వినకపోతే ప్రాక్టికల్ పరీక్షల్లో మార్కులు కట్ చేస్తామని కొందరు ప్రోఫెసర్లు తమను వేధింపులకు గురిచేస్తున్నారని పీజీ విద్యార్ధినులు ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. లైంగికంగా సహకరించాలని పీజీ విద్యార్ధినులను ప్రోఫెసర్లు వేధింపులకు గురిచేస్తున్నారు. అంతేకాదు అసభ్యంగా మాట్లాడుతున్నారని కూడ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

విచారణకు గవర్నర్ ఆదేశం

విచారణకు గవర్నర్ ఆదేశం

తిరుపతి రుయా చిన్న పిల్లల ఆసుపత్రిలో చోటు చేసుకొన్న ఈ పరిణామాలపై విచారణ చేయాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీతో పాటు ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. అయితే లైంగిక వేధింపులు చోటు చేసుకోలేదని కాలేజీలోని ప్రోఫెసర్లు తేల్చి చెప్పారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.విచారణ సమయంలో ఫిర్యాదు చేసిన విద్యార్ధిని యూటర్న్ తీసుకొంది. ఎవరో ఒత్తిడి మూలంగానే పిర్యాదు చేసినట్టుగా లిఖిత పూర్వకంగా రాసిచ్చినట్టు చెబుతున్నారు. విద్యార్ధిని భవిష్యత్తు దృష్ట్యా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని కాలేజీ యాజమాన్యం చెబుతోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరుపుతోందని సమాచారం.

English summary
A PG medical student of SV Medical College in Tirupati wrote a letter to Governor ESL Narasimhan complaining that she was being sexually harassed by three professors in the pediatric department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X