వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో క్రైంరేటులో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉందంటే.. తాజా ఎన్సీఆర్బీ నివేదిక వివరాలివే!!

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న నేరాలపై నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో తాజాగా నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికలో సైబర్ నేరాలలో, మానవ అక్రమ రవాణాలో, ఆహార కల్తీలో తెలంగాణ రాష్ట్రం టాప్ వన్ లో ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మాత్రం 2021లో దేశవ్యాప్తంగా జరిగిన నేరాలలో పదవ స్థానంలో ఉంది. 2020లో నేరాల రేటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎనిమిదవ స్థానంలో ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే 2021లో భారతీయ శిక్షాస్మృతి కింద నమోదైన నేరాలు రాష్ట్రంలో ఐదు శాతం తగ్గాయి . 2021 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపిసి కింద 1,79,611 నేరాలు మరియు ప్రత్యేక మరియు స్థానిక చట్టాల కింద 42,588 నేరాలు నమోదయ్యాయి. మొత్తం మీద దేశంలో నమోదైన నేరాలలో రాష్ట్రం 4.9% నేరాలను నమోదు చేసింది.

 మహిళలపై నేరాల్లో ఏపీది 10వ స్థానం

మహిళలపై నేరాల్లో ఏపీది 10వ స్థానం


2020 తో పోలిస్తే 2021 లో 3.8 శాతం మహిళలపై నేరాలు పెరిగాయని ఎన్సిఆర్బి నివేదిక పేర్కొంది. మహిళలపై నేరాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదవ స్థానంలో ఉందని వెల్లడించింది. 2021లో మహిళలపై 17,752 కేసులు నమోదయ్యాయి. ఇకగత ఏడాది 2020లో 17,089 కేసులు నమోదయ్యాయి. గతేడాది 1118 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 2021లో మొత్తం 1204 అత్యాచార కేసులు నమోదు కాగా బాధితుల్లో 614 మంది 18 ఏళ్ల లోపు మైనర్ లే కావడం గమనార్హం.

 2021లో ఏపీలో పెరిగిన హత్య కేసులు

2021లో ఏపీలో పెరిగిన హత్య కేసులు


ఇక రాష్ట్రంలో హత్య కేసులు కూడా స్వల్పంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 2021లో మొత్తం 956 హత్యలు నమోదుకాగా, 2020లో హత్యల సంఖ్య 853 గా నమోదయింది. ఎన్ సీ ఆర్ బీ డేటా ప్రకారం ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక లావాదేవీలు, జలవివాదాలు 2021లో ఎక్కువ హత్యలకు కారణం అయినట్టు ఎన్సిఆర్బి నివేదిక పేర్కొంది. ఇక 2020లో 2648 కేసులు నేరాలు చేసిన చిన్నారులపై నమోదైన కేసులు కాగా 2021లో 2669 కేసులు చిన్నారులపై నమోదయినట్లు తెలుస్తోంది .

 ఎస్సీ, ఎస్టీలపై దాడుల్లో ఏడో స్థానంలో ఏపీ

ఎస్సీ, ఎస్టీలపై దాడుల్లో ఏడో స్థానంలో ఏపీ


ఇక ఎస్సీల పై 3.28 శాతం, ఎస్టీలపై 12 శాతం దాడులు పెరిగాయని, దళితులు గిరిజనులపై జరుగుతున్న దాడులలో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో నిలిచిందని ఎన్సిఆర్బి నివేదిక పేర్కొంది. ఇక పోలీసులు చట్టాలు ఉల్లంఘిస్తున్న కేసులలో, పోలీసులే నేరాలకు పాల్పడుతున్న కేసులలో ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలో ఉంది. దళిత మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉండగా ఎస్టీలపై నేరాల రేటులో 5వ స్థానంలో నిలిచింది ఆంధ్ర ప్రదేశ్. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, గిరిజనుల పై నేరాలు గణనీయంగా పెరిగాయి అని తెలుగుదేశం పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు, వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్సీఆర్బీ తాజా నివేదిక నేపథ్యంలో టార్గెట్ చేస్తున్నాయి.

దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన కేసుల్లో ఏపీది మొదటి స్థానం

దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన కేసుల్లో ఏపీది మొదటి స్థానం


ఆంధ్రప్రదేశ్లో హత్యలు, అత్యాచారాలు కూడా విపరీతంగా పెరిగాయి . తాజాగా 2021 అత్యాచారాలు 8.49 శాతం పెరిగినట్టు కనిపిస్తోంది. ఇక కస్టడీ మరణాలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది. 2021లో మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో 6 కస్టడీ మరణాలు చోటుచేసుకోగా ఏపీలో 5 మరణాలు చోటుచేసుకున్నాయి. ఇక దళిత మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన కేసులలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా దళిత మహిళలపై చోటుచేసుకున్న దాడులు 150 కేసులు కాగా, అందులో 83 కేసులు ఏపీ లోనే ఉండడం గమనార్హం

English summary
Andhra Pradesh ranks 10th in crime ratings in the country. According to the latest NCRB report, AP ranks first in cases of violation of self-esteem of Dalits, seventh in attacks on SCs and STs and fifth in crimes committed by the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X