పండగ వేళ- ఏపీకి కేంద్రం భారీ వరం- రూ. 4,112 కోట్లు విడుదల
పండగ సీజన్ వేళ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అదనంగా 1,01,603 కోట్ల రూపాయల పన్ను మొత్తాన్ని విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీన విడుదల కావాల్సిన సాధారణ నెలవారీ నిధులకు ఈ మొత్తం అదనం. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రాలు తమ మూలధన వ్యయాన్ని పెంచడానికి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ కేటాయింపుల్లో ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా వాటా దక్కింది. ఏకంగా 18,227 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి లభించాయి. ఈ జాబితాలో బీహార్ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 10,219 కోట్ల రూపాయలు బీహార్ కు అందాయి. నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాష్ట్రం ఇది. ఈ నేపథ్యంలో 10,000 కోట్ల రూపాయలకు పైగా అదనపు నిధులను బీహార్ కు సమకూర్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మధ్యప్రదేశ్- రూ.7,976 కోట్లు, పశ్చిమ బెంగాల్- రూ. 7,644 కోట్లు, మహారాష్ట్ర- 6,418 కోట్లు, రాజస్థాన్- రూ. 6,123 కోట్లు అందాయి. ఈ ఆరు రాష్ట్రాల తర్వాత ఏపీ నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి 4,112 కోట్ల రూపాయలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.
తెలంగాణకు రూ.2,136 కోట్ల రూపాయలు నిధులు అందాయి. ఉత్తరాఖండ్- రూ.1,136 కోట్లు, ఒడిశా- రూ. 4,601 కోట్లు, తమిళనాడు- రూ. 4,144 కోట్లు, కర్ణాటక- రూ.3,705 కోట్లు, జార్ఖండ్- రూ.3,360 కోట్లు అదనపు పన్నుల వాటాగా అందుకున్నాయి. ఛత్తీస్‌గఢ్- రూ.3,462 కోట్లు, గోవా- రూ.392 కోట్లు, గుజరాత్- రూ.3,534 కోట్లు, హర్యానా- రూ.1,111 కోట్లు, హిమాచల్ ప్రదేశ్- రూ.843 కోట్లు, కేరళ- రూ.1,956 కోట్లు, మణిపూర్- రూ.727 కోట్లు, మేఘాలయ- రూ.779 కోట్లు, మిజోరం- రూ.508 కోట్లు, నాగాలాండ్- రూ.578 కోట్లు లభించాయి.
రెండు రోజుల కిందటే చంద్రబాబు.. ఢిల్లీ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో సమావేశం అయ్యారు. ఆయన వెంట కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పలువురు ఎంపీలు ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన అదనపు నిధుల విడుదల గురించి మాట్లాడారు. వాటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
-
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications