ఏపీ రీపోలింగ్: ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్‌కు సంబంధించిన సమాహారం
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలివిడత పోలింగ్ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అక్కడ పోలింగ్ పై ఎన్నికల సంఘానిక ఫిర్యాదులు అందాయి. విచారణ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. నరసారావుపేట అసెంబ్లీ పరిధిలోని కేసనపల్లిలోని 94వ పోలింగ్ కేంద్రం,గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో ఉన్న 244 పోలింగ్ కేంద్రం, నెల్లూరు శాసనసభ నియోజకవర్గంలోని పల్లెపాలెంలోని ఇసుకపల్లి 41వ పోలింగ్ కేంద్రం, నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని అటకానితిప్పలోని 197వ పోలింగ్ కేంద్రం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలోని కలనూతలలో ఉన్న 247వ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది.

రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే ఈసీ హెచ్చరించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది.












Click it and Unblock the Notifications