AP Covid cases : ఏపీలో కొత్తగా 1506 కరోనా కేసులు... మరో 16 మంది మృతి....
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 16 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,93,697కి చేరింది. ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 13,647కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,865 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 1835 మంది కరోనా నుంచి కోలుకోగా... ఇప్పటివరకూ మొత్తం 19,59,290 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Recommended Video
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 219 కేసులు, చిత్తూరులో 217, నెల్లూరులో 181 కేసులు అత్యల్పంగా కర్నూలులో 15 కొత్త కేసులు నమోదయ్యాయి.కోవిడ్ కారణంగా తాజాగా సంభవించిన మరణాల్లో చిత్తూరులో నలుగురు,కృష్ణా జిల్లాలో నలుగురు,తూర్పు గోదావరిలో ఇద్దరు,విశాఖపట్నంలో ఇద్దరు,గుంటూరు,నెల్లూరు,శ్రీకాకుళం,పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 65,500 శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఇప్పటివరకూ 2,456,61,449 శాంపిల్స్‌ను పరీక్షించారు.

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూని ఈ నెల 21 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్కు,భౌతిక దూరం తదితర జాగ్రత్తలను పాటించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొవిడ్-19 ప్రోటోకాల్స్ అమలయ్యేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలను ప్రభుత్వం ఆదేశించింది.
ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,083 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 493 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,21,92,576కి చేరింది. మరణాల సంఖ్య 4,31,225కి చేరింది. ప్రస్తుతం 3,85,336 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 37,927 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ 54,38,46,290 మందికి వ్యాక్సిన్లు వేశారు. శనివారం(ఆగస్టు 14) ఒక్కరోజే 73,50,553 మందికి వ్యాక్సిన్లు వేశారు.












Click it and Unblock the Notifications