• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం (ఫోటోలు)

By Nageswara Rao
|

విజయవాడ: గోదావరి-కృష్ణా జీవనదుల పవిత్ర అనుసంధానం ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో చారిత్రక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన పట్టిసీమ ప్రాజెక్ట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మొదటి పంప్ హౌస్‌ను పరిశీలించి పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

వృథాగా పోతున్న గోదావరి జలాలను మళ్లించి రాయలసీమను కరవు నుంచి పారద్రోలాలన్నదే తన లక్ష్యమన్నారు. తన సంకల్పాన్ని సాధించేందుకు మంత్రులు, అధికారులు రాత్రింబవళ్లు శ్రమించి పట్టిసీమ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారన్నారు.

డబ్బు కంటే నీరు ఎంతో విలువైందన్నారు. జల వనరులను కాపాడుకోలేకపోతే మానవ మనుగడే కష్టమన్నారు. ఈ రోజును తాను మర్చిపోలేనని, తన జన్మ చరితార్థమయిందన్నారు. వర్షపు నీటిని సంరక్షించడంపై ప్రతి ఒక్కరు ఆలోచించాలన్నారు.

దేశంలోనే ప్రప్రథమంగా నదుల అనుసంధానం చేయగల్గిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ప్రకటించారు. జీవనదుల అనుసంధానంతో ఖరీఫ్, రబీ సీజన్‌లకు సకాలంలో నాట్లు వేసుకుంటూ 13 లక్షల ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేసుకోగలుగుతామని రైతులకు భరోసా ఇచ్చారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి మిగులు జలాలను కృష్ణాకు తరలించడంతోపాటు, కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి రాయలసీమ జిల్లాలకు మళ్లించి సీమను కరవురహితంగా తీర్చిదిద్ది రైతులకు, ప్రజలకు బహుళ ప్రయోజనాలు కలిగిస్తామన్నారు.

 50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

కృష్ణా గోదావరిల అనుసంధానంతో ‘నా జన్మ చరితార్థమైంది. ఎవరికైనా ఇంతకంటే ఏంకాలి' అంటూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. మహత్తర కార్యంలో నిర్వహించే సభకు హాజరైన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానంటూ ప్రకటించారు.

 50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రి ప్రాంతంలో మంత్రి దేవినేని ఉమ అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభలో సిఎం చంద్రబాబు ఉత్సాహంగా మాట్లాడారు. నదుల అనుసంధానాన్ని పదేపదే ప్రస్తావిస్తూ చరిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టడం పూర్వజన్మ సుకృతమన్నారు.

50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

2003 బ్రహ్మోత్సవాల సమయంలో అలిపిరి వద్ద తనపై జరిగిన దాడినుంచి వేంకటేశ్వరుడి ఆశీస్సులతో ప్రాణాలతో బయటపడింది, ఈ మహోన్నత ఘట్టం కోసమేనని చెమ్మగిల్లిన కళ్లతో ప్రకటించారు. నా జీవితంలో ఇంత ఆనందపడిన సందర్భం లేదు. పట్టిసీమతో నీటిని వొడిసిపట్టి కృష్ణా నదికి చేర్చడం ద్వారా పవిత్ర సంగమానికి శ్రీకారం చుట్టగలిగామన్నారు.

 50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

ప్రాణాధారమైన నీటిని డబ్బుకంటే పదిలంగా వాడుకోవాలన్నారు. ఇక జలాల వినియోగంపైనా ఆడిట్ నిర్వహిస్తామని ప్రకటించారు. పట్టిసీమ ద్వారా 80 టిఎంసిల నీటిని కృష్ణాకు తెస్తామని, జూలై మాసాంతానికి ప్రతి రైతుకూ నిరాటంకంగా సాగునీరు అందిస్తామన్నారు.

 50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

రానున్న కృష్ణా పుష్కరాలు గోదావరి కంటే మిన్నగా నిర్వహిస్తామన్నారు. 500 ప్రొక్లెయిన్లు, 1214 లారీలతో జూలై 2న కాల్వల నిర్మాణం చేపట్టి కేవలం 74 రోజుల్లోనే విజయవంతంగా పూర్తి చేయడం మహా సంకల్పమేనని అధికార్లు, ఇంజనీర్లను ప్రత్యేకంగా అభినందించారు.

 50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

ఏదైనా మంచికి సూచనలిస్తే స్వాగతిస్తానని, అదే అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే సహించేది లేదు, ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. పట్టిసీమ మొదటి పంపు ప్రారంభిస్తున్నామని, వారానికో పంపు అదనంగా పని చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పూర్తిస్థాయిలో గోదావరి జలాలను కృష్ణాకు తీసుకొస్తామన్నారు.

 50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

పోలవరం వరం లాంటిదని, 2018నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. కెఎల్ రావులాంటి మహనీయుని ఆశయాన్ని కార్యరూపంలోకి తేవటంలో తనతోపాటు మంత్రి దేవినేని ఉమ, ఎందరో అధికారులు, ఇంజనీర్లు శ్రమించారంటూ పేరుపేరునా అభినందించారు.

 50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

కృష్ణాజిల్లాలోని ఇబ్రహింపట్నం సమీపంలోని ఫెర్రీ వద్ద ఏర్పాటు చేసిన కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం పైలాన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. పైలాన్‌కు ఇరువైపులా కృష్ణ, గోదావరి మాతల విగ్రహాలను ఏర్పాటు చేశారు. కృష్ణా, గోదావరి నదుల పవిత్ర సంగమ స్థితికి చేరుకుని చరిత్ర విజయానికి గుర్తుగా మొక్కనునాటి గోపూజ నిర్వహించారు.

 50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

బుధవారం ఉదయం సరిగ్గా 10 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, ఉన్నతాధికారులు శాస్త్రోక్తంగా పూజాదికాలు, మేళతాళాల మధ్య నదీ జలాల సంగమానికి హారతి ఇచ్చి, పట్టిసీమ పంపు ద్వారా పోలవరం కుడి కాలువకు నీటిని విడుదల చేశారు.

 50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

పట్టిసీమ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీటిని కృష్ణానదికి చేర్చి రెండు నదులను అనుసంధానించి, ఆపై అంతే మొత్తం నీటిని శ్రీశైల ప్రాజెక్టు నుంచి రాయలసీమకు తీసుకెళ్తారు. ఇందుకోసం తరలివచ్చే ప్రజల కోసం దాదాపు 25 ఎకరాల భూమిని చదును చేసి విస్తృత ఏర్పాట్లు చేశారు.

 50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

నదీతీరం వద్ద ఏర్పాటైన కనకదుర్గమ్మ వారి ఆలయం వద్ద ఏర్పాటైన మండపారాధనలో జరుగుతున్న వరుణ హోమం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఇవో సిహెచ్ నరసింగరావు సిఎంను వేదపండితుల మంత్రోచ్ఛారణలతో సంగమ ప్రదేశానికి తోడ్కోని వెళ్లారు.

 50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

స్ధానిక పూజారి శివప్రసాద్ శర్మ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య సంగమ ప్రదేశంలో గోదావరి మాతకు పలు వస్త్రాలు సమర్పించి సిఎం పంచహారతులు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ 23 ఎకరాల భూమిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు.

 50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

50 ఏళ్ల కల ఫలించిన వేళ: బాబు ఉద్వేగభరిత ప్రసంగం

శాసన సభా స్పీకర్ కోడెల శివప్రసాద్, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమ, యనమల రామకృష్ణుడు, అచ్చెన్ననాయుడు, పల్లె రఘునాథరెడ్డి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజమ్మ, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, ఎంపీలు కేశినేని శ్రీనివాస్, కంభంపాటి హరిబాబు, కొనకళ్ల నారాయణ, మాగంటి బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, పలువురు ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నేతలు మాట్లాడారు.

English summary
Chief Minister Chandrababu Naidu performed puja at Ibrahimpatnam near Vijayawada. He then switched on a pump, commissioning an irrigation project that will pump Godavari waters into a canal 4 km away. From there, it will flow 174 km to meet the Krishna river.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X