శేషాచలం ఎన్‌కౌంటర్, కాలిన గుర్తులు, బుల్లెట్ గాయాలు: చిక్కుల్లో చంద్రబాబు?

హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మందిని పోలీసులు హతమార్చిన ఘటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చిక్కులు తెచ్చి పెట్టేలా కనిపిస్తోంది. ఆత్మరక్షణ కోసం తాము కాల్పులు జరిపామని, ఆ కాల్పుల్లోనే 20 మంది కూలీలు మరణించారని పోలీసులు చెబుతున్నప్పటికీ అందుకు విరుద్ధమైన వార్తాకథనాలు జాతీయ మీడియాలో కూడా వస్తున్నాయి.

దానికితోడు, తమిళనాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శనాత్మకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు చెలరేగుతున్నాయి. తమిళనాడులోని తెలుగు ప్రజలకు అది ఇబ్బంది కలిగించే విషయమే. జాతి సంపదను దోచుకెళ్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ఎపి డిజిపి జెవి రాముడు అంటున్నారు. బస్సులోంచి దింపి చంపాల్సిన అవసరం తనకు లేదని కూడా ఆయన అంటున్నారు. కానీ, వాటిని పట్టించుకోకుండా జాతీయ మీడియాలో పోలీసు చర్యకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి.

జాతీయ మానవ హక్కుల సంఘం కూడా సంఘటనపై తీవ్రంగా ప్రతిస్పందించింది. దానిపై నోటీసులు జారీ చేసింది. విచారణ చేపట్టడానికి సిద్ధమైంది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాట్లాడారు. సంఘటనపై చంద్రబాబు రాజ్‌నాథ్ సింగ్‌కు ఆయన వివరణ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా ఎన్‌కౌంటర్‌ను బూటకంగానే వ్యాఖ్యానిస్తోంది. కూలీలను చంపకుండా విచారించి ఉంటే ఎర్రచందనం స్మగ్లింగ్ వెనక ఉన్న పెద్దల గుట్టు తెలిసేదని సిపిఐ నాయకులు అంటున్నారు. హతమైన 20 మందిలో ఎక్కువ మంది తమిళనాడుకు చెందినవారు కావడం కూడా చంద్రబాబుకు సమస్యగా మారినట్లు కనిపిస్తోంది. కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా ఎన్‌కౌంటర్ జరిగిన తీరును ఖండిస్తున్నారు.

 In Andhra Pradesh Shooting, Questions Over Burn Marks, Bullet Injuries

మృతుల దేహాలపై కాలిన గుర్తులున్నాయని, మరికొన్ని మృతదేహాల ఛాతీపై, తలలపై బుల్లెట్ గాయాలున్నాయని, ఇవి పోలీసుల వాదనను సవాల్ చేస్తున్నాయని జాతీయ మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. మానవ హక్కుల సంఘాలు సంఘటనపై తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నాయి. స్వతంత్రంగా విచారణ చేపట్టాలని అవి తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

కూలీలు రాళ్లతో, గొడ్డళ్లతో, కత్తులతో దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఈ దాడిలో పోలీసులు ఎవరైనా గాయపడ్డారా, లేదా అనే విషయం తెలియడం లేదు. దాని గురించి పోలీసు ఉన్నతాధికారులు కూడా మాట్లాడడం లేదు. ఈ స్థితిలో చంద్రబాబుకు ఇది తలనొప్పిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+