Chandrababu Naidu: జగన్ చిరునామా గల్లంతు చేసిన చంద్రబాబు అనుభవం..!!
2024 జూన్ 4,ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర నమోదైంది. 2019 ఎన్నికల్లో జగన్ సునామీతో 23 సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సింహంలా గర్జించింది. జూలు విదిల్చి జగన్ నేతృత్వంలోని వైసీపీని మట్టికరిపించింది.భారత దేశ రాజకీయాల్లోనే అత్యంత అనుభవజ్ఞులుగా పేరుగాంచిన చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ పోటీచేసిన 144 స్థానాల్లో ఏకంగా 135 సీట్లను నెగ్గడం ద్వారా విజయఢంకా మోగించింది. ఇక కూటమి పరంగా చూస్తే టీడీపీ-జనసేన-బీజేపీలు ఏకంగా 164 సీట్లను కైవసం చేసుకున్నాయి.
కూటమి దెబ్బకు విలవిలలాడిపోయిన వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది.దీంతో చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా తయారైంది వైసీపీ పరిస్థితి.151 నుంచి 11 స్థానాలకు పడిపోవడంతో ఒక్కసారిగా పార్టీలో గందరగోళ వాతావరణం నెలకొంది. అప్పటికే చాలా సర్వేలు కూటమిదే అధికారం అని జోస్యం చెప్పినప్పటికీ వైసీపీ ఇంత దారుణంగా ఓడిపోతుందని అంచనా వేయలేకపోయారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రజానాడిని ఏ సర్వే పసిగట్టలేకపోయింది.

కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు ఒక పార్టీ ఇంతలా ఘోర వైఫల్యం చెందడానికి గత ఐదేళ్లలో కారణాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. వన్ ఇండియా తెలుగుతో ప్రత్యేకంగా మాట్లాడిన టీడీపీ నేతలు వైసీపీ ఓటమికి పలు కారణాలను విశ్లేషించారు.
1. వైసీపీ తప్పిదాలను ఎండగట్టడం
నాడు అధికారంలో ఉండి బలమైన వైసీపీ చేస్తున్న తప్పిదాలను టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యింది. అసెంబ్లీలో సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ నిత్యం ప్రజల్లో ఉండి వైసీపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలపై పార్టీ పోరాడిందని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. జగన్‌కు నిద్రలేకుండా చేశామని చెబుతున్నారు.2014 నుంచి 2023 వరకు తెలంగాణలోని కేసీఆర్ సర్కార్‌పై పోరాటం చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది.
కానీ ఏపీలో మాత్రం టీడీపీ ప్రతిపక్ష పాత్రను చాలా సమర్థవంతంగా నిర్వహించిందని నేతలు చెబుతున్నారు.ధరల పెరుగుదల, భూమి మరియు ఇసుక విధానాలు,మద్యం పాలసీలపై జగన్ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రశ్నించే గొంతుకగా టీడీపీ సక్సెస్ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పోలింగ్‌కు చివరి 10 రోజుల్లో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ప్రజల్లోకి బలంగా టీడీపీ తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యింది. కూటమి విజయానికి ఇదొకటి ప్రధాన కారణమని అనలిస్టులు భావిస్తున్నారు.

2.హామీలు:
ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీలు కచ్చితంగా ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాయనే చెప్పాలి. ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బీసీ సంరక్షణ చట్టం, సామాజిక పెన్షన్ల పెంపు, ఆడబిడ్డ నిధి పథకం కింద 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు రూ.1500 ఆర్థిక సాయం, రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20వేల ఆర్థిక భరోసా,ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించడం, నిరుద్యోగ యువతకు రూ.3వేలు నిరుద్యోగ భృతి హామీలు పసుపు పార్టీని విజయతీరాలకు చేర్చాయి.
3. వైసీపీ సెల్ఫ్ గోల్స్:
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదికను కూల్చడంతో ప్రారంభమైన విధ్వంసం ఐదేళ్ల పాటు కొనసాగింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసాగించకపోగా వాటిని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామితో జరుగుతున్న పలు అభివృద్ధి పనులకు బ్రేక్ పడేలా జగన్ ప్రభుత్వం వ్యవహరించిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ సంస్థ లులు మాల్ ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సి ఉండగా... అప్పటికే కేటాయించిన భూమిని జగన్ ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంతో ఆ సంస్థ తెలంగాణ వైపు మరలింది.హైదరాబాదులో లులూ మాల్ ఏర్పాటు చేసింది. ఇలాంటివి చెప్పుకుంటే చాలానే ఉన్నాయి.

అయితే అంతకుముందు వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన పలు మంచి పనులను చంద్రబాబు అధికారంలోకి రాగానే కొనసాగించారనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు.ఇక రియల్ ఎస్టేట్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి విషయంలోనూ జగన్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలే తీసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇక చివరిగా అప్పటికే మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడును అరెస్టు చేయడంతో అపఖ్యాతి మూటగట్టుకున్నారు జగన్.
ప్రజలు మేధావులు ఈ అరెస్టును ఖండించారు. అంతా ఒకతాటిపైకొచ్చారు. చంద్రబాబు అరెస్టుతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ఇక సంక్షేమంకు పెద్దపీట వేసిన జగన్.. అభివృద్ధిని గాలికొదిలేశారనే అభిప్రాయం చాలామంది ఓటర్లలో నెలకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాదు అంతలా అభివృద్ధి చెందిందంటే అది నాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చొరవతోనే జరిగిందనే అంశాన్ని ఏపీ ఓటర్లు గుర్తుంచుకుని మరీ ఓటుతో సమాధానం చెప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కూటమి: ఇక టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కచ్చితంగా వర్కౌట్ అయ్యిందనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ కాపు సామాజిక వర్గాల ఓట్లు కచ్చితంగా ఫలితాలను డిసైడ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.అయితే కమ్మ కాపు ఓట్లను చీల్చేందుకు జగన్ పార్టీ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి ఒక్కటవడం, కమ్మ కాపు సామాజికవర్గాలు ఒకే తాటిపైకి రావడంతో 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక చరిత్ర సృష్టించడం జరిగింది.
అభ్యర్థులు: ఈసారి అభ్యర్థుల ఎంపిక ఆషామాషీగా జరగలేదు. గెలుపు గుర్రాలను మాత్రమే టీడీపీ నేతృత్వంలోని కూటమి బరిలోకి దించింది. పార్టీకి ఎంతోమంది విధేయులున్నప్పటికీ తాము చేపట్టని సర్వేలో అభ్యర్థి గెలవడం కష్టమనే నివేదిక వస్తే... వారు ఎంతటి వారైనా సరే పక్కన పెట్టి కేవలం గెలిచే సత్తా ఉన్నవారికే టికెట్లను టీడీపీ-జనసేన-బీజేపీలు కేటాయించాయి. దీంతో కూటమి ఏకంగా 164 స్థానాలను కైవసం చేసుకుని విజయ ఢంకా మోగించింది.

సోషల్ మీడియా టీమ్ ప్రభావం:
చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న సమయంలో టీడీపీ సోషల్ మీడియా తమ అధినేత అరెస్టు అక్రమం అని చెబుతూ నిర్వహించిన క్యాంపెయిన్ ట్రెండ్ క్రియేట్ చేసింది. దాదాపుగా 40 రోజులకు పైగా ఈ ట్రెండ్ కొనసాగడంతో ప్రపంచానికి చంద్రబాబు అరెస్టు అక్రమం అని తెలిసొచ్చిందని సోషల్ మీడియా విశ్లేషకులు చెబుతున్నారు.దాదాపుగా 600 నుంచి 800 వ్యూహాత్మకమైన కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి దోహదపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా యుగంలో ఒక రాజకీయ పార్టీ గెలుపోటములు కచ్చితంగా సోషల్ మీడియా ప్రభావితం చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలోనే అసంతృప్తులు
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీలోని కొందరు నాయకులు ఓటమికి గల కారణాలను బాహాటంగానే బయటపెట్టారు. రాజాంనగరం వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజ జగన్ ప్రభుత్వంలోని అధికారులు, సలహాదారులపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా జగన్‌ను సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ తీసుకొచ్చేలా అధికారులు వ్యవహరించారని జక్కంపూడి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అబ్సల్యూట్ పొలిటికో వివరణ
తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన పొలిటికల్ కన్సల్టెన్సీ అబ్సొల్యూట్ పొలిటికో వ్యవస్థాపకులు శ్రీపద్ సాయి నందన్ టీడీపీ గెలుపునకు వైసీపీ ఘోర ఓటమికి కారణాలను విశ్లేషించారు. కొన్ని ఎంపిక చేయబడ్డ సంక్షేమ పథకాలు కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే చేరడంతో 35శాతంగా ఉన్న ఓసీ హిందూ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసిందని అన్నారు.వారు పన్ను రూపంలో చెల్లిస్తున్న మొత్తాన్ని సంక్షేమం పేరుతో మరొక వర్గానికి ఇవ్వడాన్ని ఆ ఓటర్లు జీర్ణించుకోలేకపోయారని పేర్కొన్నారు.
అంతేకాదు రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి లేకపోవడాన్ని చాలామంది వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పుకొచ్చారు.ఇక టీడీపీ బీజేపీతో పవన్ కళ్యాణ్ జతకట్టడం మరో లెవెల్‌కు ఫలితాలను తీసుకెళ్లాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 16శాతంగా ఉన్న కాపు సామాజిక వర్గం, 5శాతంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం కలిసి బలమైన ప్రతిపక్షంగా ఏర్పడి జగన్ ఓటమికి కారణమయ్యాయని అబ్సల్యూట్ పొలిటికో వ్యవస్థాపకులు విశ్లేషిస్తున్నారు.

ఇక ఆశ్చర్యకరంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు కూటమి వైపు తిరగాయని చెప్పిన సంస్థ...తొలిసారి ఓటు వేస్తున్న వారిని, యువతను అట్రాక్ట్ చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారని ఇది కూటమికి మరింత బలం చేకూర్చిందని చెప్పారు.ఇక 32శాతంగా ఉన్న బీసీ సామాజిక వర్గం కూడా కూటమివైపు మల్లడంతో జగన్‌కు ఘోర ఓటమి తప్పలేదని చెప్పారు.
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఓటమిపాలైతే తిరిగి పుంజుకుంటుంది అంతే తప్ప వెనకడుగు వేయదు. అయితే ఎన్నికల్లో ఒక డిజాస్టర్‌ను చూసిన వైసీపీ తిరిగి పుంజుకోవడం కష్టమే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవతోంది.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications