ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేక హోదా హుళక్కే

న్యూఢిల్లీ: ఉమ్మడి రాష్ట్ర విభజన ద్వారా ఏర్పడిన కొత్త రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేక హోదా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎత్తిచూపిన పొరపాట్లను చక్కదిద్దుతూ ఎపి పునర్వ్యస్థీకరణ చట్టాన్ని సవరించే యోచనలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. ఇందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంది.

ఈ పార్లమెంటు సమావేశాల్లోనే సవరణలకు ఆమోదం పొందడానికి అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నామని, ఒకవేళ ఈ సమావేశాల్లో సాధ్యం కాకపోతే బడ్జెట్ సమావేశాల్లో దాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఓ దినపత్రికతో చెప్పారు. సవరణలపై మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్‌తోనూ ఇతర ఫ్లోర్ లీడర్స్‌తోనూ మాట్లాడామని, తాము తేబోయే సవరణలకు వారు కూడా సానుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు.

ఈ ఏడాది జూన్ 2వ తేదీన ఎపి పునర్వ్యస్థీకరణ బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత భద్రాచలం పరిధిలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం సవరణలు తెచ్చింది.

andhra pradesh, telangana, special status

ఆ దినపత్రిక వార్తాకథనం ప్రకారం సవరణలు ఇవే..

1. ఆంధ్రప్రదేశ్‌లోని 175 శానససభా స్థానాలను పరిగణనలోకి తీసుకుని ఎపి శాసన మండలి సీట్లను 50 నుంచి 58కి పెంచుతారు.

2. తెలంగాణ శాసన మండలి సీట్ల సంఖ్య 40 అలాగే ఉంటుంది. కానీ చట్టంలోని లోపాలను సవరిస్తారు.

3. రేణుకా చౌదరి, ఎంఎ ఖాన్ కెవిపి రామచందర్ రావు, జైరాం రమేష్, దేవేందర్ గౌడ్, కె. కేశవరావు, సిఎం రమేష్ వంటి రాజ్యసభ సభ్యుల విషయంలో ఏ రాష్ట్రానికి చెందినవారు ఆ రాష్ట్రానికి వెళ్లే విధంగా సవరణలు చేస్తారు. తమ సొంత రాష్ట్రాలకు వారు ప్రాతినిధ్యం వహించే విధంగా మార్పులు చేస్తారు. ఆరుగురు పార్లమెంటు సభ్యులు తమ సొంత రాష్ట్రాలకు చెందకపోవడం వల్ల తమ ఎంపిల్యాడ్ ఫండ్స్‌ను తమ సొంత రాష్ట్రాలకు ఖర్చు చేసుకోలేకపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+