వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సర్కార్ కేంద్రం తీపికబురు: స్పెషల్ రివార్డ్: నిర్మలమ్మ శాఖ నుంచి నిధులు: స్థానిక సంస్థల్లో

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. నిర్మలా సీతారామన్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఆర్థికమంత్రిత్వ శాఖ నుంచి రివార్డ్ అందింది. దీని విలువ రూ.344 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని కేంద్రం రివార్డ్‌గా ఏపీ ప్రభుత్వానికి అందించనుంది. కేంద్ర రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా పౌర సంస్కరణలను అమలు చేసిన రెండో రాష్ట్రంగా ఏపీ నిలిచింది. మధ్యప్రదేశ్ తొలిస్థానాన్ని ఆక్రమించింది. ఈ రెండు రాష్ట్రాలకు అదనంగా 1,004 కోట్ల రూపాయల మొత్తాన్ని రివార్డ్‌గా ప్రకటించింది. తెలంగాణకు 179 కోట్ల రూపాయలను రివార్డ్‌గా మంజూరు చేస్తుంది.

నీ ఇంట్లో ఆడపిల్లలకు ఇలాగే జరిగితే ఏం చేస్తారు: రేపులు చేసే వారికి జగన్ ఆదర్శం: అనిత ఫైర్నీ ఇంట్లో ఆడపిల్లలకు ఇలాగే జరిగితే ఏం చేస్తారు: రేపులు చేసే వారికి జగన్ ఆదర్శం: అనిత ఫైర్

స్థానిక సంస్థల్లో పౌర సంస్కరణలు

కేంద్ర ప్రభుత్వం కొత్తగా స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఎక్స్‌పెండిచర్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పన్నుల రాబడి సక్రమంగా లేకపోవడం, మూల ధన వ్యయంలో లోటును ఎదుర్కొంటోన్న రాష్ట్రాలకు ఆర్థికంగా వెసలుబాటును కల్పించడం.. ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం కింద డిపార్ల్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ ఈ నిధులను మంజూరు చేసింది. ఈ విభాగం ఆర్తికశాఖ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో కొనసాగుతోంది. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రగతి కనిపించిన రాష్ట్రాలకు ఈ స్కీం కింద నిధులను మంజూరు చేస్తారు.

స్థానిక సంస్థలు సహా..

పట్టణ, స్థానిక సంస్థల్లో జగన్ సర్కార్ కొన్ని విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టిందని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో పౌర సంస్కరనలను తీసుకుని రావడం ద్వారా పరిపాలనను మరింత సరళీకరించినట్లు పేర్కొంది. దీనితోపాటు- వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)ల్లో సంస్కరణలను తీసుకొచ్చిందని తెలిపింది. నాలుగింట్లో మూడు సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తోన్నందున.. రివార్డ్ కింద ఏపీకి అదనంగా రూ.344 కోట్ల రూపాయలను మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇందులో 172 కోట్ల రూపాయలను విడుదల చేసింది కూడా.

Recommended Video

MLA Kethireddy Distributing House Pattas ఇళ్ల ప‌ట్టా ల‌బ్ధిదారుడికి ఎమ్మెల్యే కేతిరెడ్డి సూచ‌న
మొత్తంగా రూ.9,880 కోట్లు..

మొత్తంగా రూ.9,880 కోట్లు..

మూలధన వ్యయం కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం 9,880 కోట్ల రూపాయలను కేటాయించింది. తాము సూచించిన పౌర సంస్కరణల్లో ప్రగతి కనపరిచిన 27 రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని పంచుతుంది. ఇందులో ఏపీ-344, మధ్యప్రదేశ్-660 కోట్ల రూపాయల రివార్డును కేంద్రం ప్రకటించింది. ఆయా రాష్ట్రాలకు అదనంగా 1,004 కోట్ల రూపాయల కేపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను ప్రకటిస్తామని తెలిపింది. పట్టణాలు, స్థానిక సంస్థల్లో ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా, జలవనరులు, విద్యుత్, రవాణా, విద్య రంగాల్లో మెరుగైన పురోగతి కనిపించిన రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని కేటాయిస్తుంది.

English summary
Andhra Pradesh and Madhya Pradesh and have become the first group of States to complete three out of the four citizen centric reforms by Ministry of Finance. The two States have completed the One Nation, One Ration Card Reforms, Ease of Doing Business Reforms, and Urban Local Bodies Reforms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X