రోడ్డు ప్రమాదం: ఫిలిప్పీన్స్‌లో ఏపీ యువకుడు మృతి

అమరావతి: ఫిలిప్పీన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువకుడు మృతి చెందాడు. కృష్ణా జిల్లా నందిగామ నేతాజీనగర్‌కు చెందిన జగదీష్(22) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

2016లో జగదీష్ 2016లో వైద్య విద్య కోసం ఫిలిప్పీన్స్ వెళ్లాడు. సోమవారం అతడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జగదీష్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడ్ని ఆస్పత్రి తరలించారు.

 Andhra Pradesh youth killed in a accident in Philippines

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జగదీష్ మృతి చెందాడు. జగదీష్ వెటర్నరీ కోర్సు నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. జగదీష్ మృతితో అతని కుటుంబంతోపాటు నందిగామలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అమెరికాలో తెలుగు టెక్కీ మృతి..
ఇది ఇలావుంటే, అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. . మిచిగాన్ లాన్‌సింగ్‌లోని సాఫ్ట్‌వేర్ సంస్థలో హైదరాబాద్‌కు చెందిన చరితా రెడ్డి(25) పనిచేస్తున్నారు. చరితా రెడ్డి కారును మరో కారు అత్యంత వేగంగా వచ్చి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చరితా రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.

కాగా, ఆమె కారును ఢీకొట్టిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. చరితా రెడ్డి కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమీపంలోని ఆస్పత్రిలో వీరికి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. చరితారెడ్డి కుటుంబసభ్యులకు సమాచారం చేరవేసినట్లు తెలిసింది. చరితారెడ్డి ఆకస్మిక మృతితో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+