అందుకే ప్రొఫెసర్ లైంగిక వేధింపులు, మేలు చేశారు: గంటా కారును అడ్డుకున్న విద్యార్థులు
ఏయూ సంస్కృత విభాగం ప్రొఫెసర్ ఏడుకొండలును విభాగాధిపతి హోదా నుంచి తొలగించి అనంతరం ఆయనపై విచారణ కొనసాగించాలని మంత్రి గంటా శ్రీనివాస రావు ఆదేశాలు జారీ చేశారు.
విశాఖ: ఏయూ సంస్కృత విభాగం ప్రొఫెసర్ ఏడుకొండలును విభాగాధిపతి హోదా నుంచి తొలగించి అనంతరం ఆయనపై విచారణ కొనసాగించాలని మంత్రి గంటా శ్రీనివాస రావు ఆదేశాలు జారీ చేశారు.
Recommended Video


గంటాను అడ్డుకున్న విద్యార్థులు
మంగళవారం ఏయూలో జరిగిన ఏపీ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో సంస్కృత విభాగం విద్యార్థినులు, పరిశోధకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు మంత్రి గంటా శ్రీనివాస రావు కారును అడ్డగించారు. ఆయన కారు ఎదుట ముందు బైఠాయించారు.

అందుకే మళ్లీ లైంగిక వేధింపులు
ఏడుకొండలును విధుల నుంచి తొలగించాలని నినాదాలు చేశారు. గతంలో ఆరోపణలు వచ్చినప్పడు యూనివర్సిటీ యాజమాన్యం తగిన విధంగా స్పందించకపోవడం వల్లే మళ్లీ లైంగిక వేధింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులు క్లాసులకు హాజరవుతున్నప్పటికీ అటెండెన్స్ వేయడం లేదని ఆరోపించారు.

అలా ప్రొఫెసర్‌కు మేలు చేశారు
ఆయనపై గతంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ సర్వీసు రిజిస్టర్లో రాయకుండా ఆయనకు మేలు చేశారని విద్యార్థులు మండిపడ్డారు. ఈ మేరకు గంటాకు వినతిపత్రం ఇచ్చారు.

ఏం చర్యలు తీసుకోవాలో చెప్పిన గంటా
దీనిపై మంత్రి గంటా మాట్లాడారు. పవిత్రమైన ఆచార్య వృత్తిలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు రావడం బాధాకరమన్నారు. విచారణ చేయించి కఠిన చర్యలు తీసుకోవాలని వర్సిటీ వీసీ ఆచార్య నాగేశ్వర రావును ఆదేశించారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై తన నిర్ణయం చెప్పారు. ఏడుకొండలును తొలుత విభాగాధిపతి పదవి నుంచి తొలగించి విచారణ చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications