టిడిపికి కౌంటర్: మోఢీతో భేటీపై జగన్ కు మద్దతుగా టిడిపిని ఏకేసిన సోము వీర్రాజు

Posted By:
Subscribe to Oneindia Telugu

కాకినాడ: ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వైసీపీ అధినేత జగన్ సమావేశం కావడంపై టిడిపి , బిజెపి నేతల మధ్య మాటల యుద్దం ప్రారంభమైంది. బిజెపి నేతలు వైసీపీ చీఫ్ జగన్ కు ప్రధానమంత్రి మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని సమర్థించుకొన్నారు.

మోడీ జగన్ భేటీపై టిడిపి వ్యాఖ్యలకు బీజేపీ నేత సోము వీర్రాజు గట్టిగానే సమాధానమిచ్చారు. వైసీపీ అధినేత జగన్ కు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని ప్రశ్నించే అధికారం టిడిపికి చెందిన మంత్రులకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.

Andhrapradesh Bjp leader Somu Veerraju slams on Tdp leaders

టిడిపి నేతలపై సోమువీర్రాజు విరుచుకపడ్డారు. జగన్ ప్రధానిని కలవడంపై మంత్రులు విమర్శించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. దేశంలో అనేక మంది రాజకీయనాయకులపై సీబీఐ కేసులున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అయితే అలాంటివారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం బీజేపీ లక్ష్యం కాదన్నారు. అయితే వైసీపీకి కేబినేట్ హోదా ఉన్న పిఎసి చైర్మెన్ పదవిని ఎందుకు ఇచ్చాని ఆయన ప్రశ్నించారు. విధానాలు వేరు, రాజకీయాలు వేరని ఆయన చెప్పారు. జగన్ రాష్ట్రపతిని కూడ కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhrapradesh Bjp leader Somu Veerraju slams on Tdp leaders on Friday.he indirectly supported to Ysrcp chief Ys Jagan.
Please Wait while comments are loading...