AP Budget 2023-24: సుస్థిర అభివృద్ధి, సుపరిపాలనే తమ ప్రభుత్వ లక్ష్యం: బుగ్గన
కాసేపట్లో ఏపీ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు.
అమరావతి: ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా మంగళవారం రోజున గవర్నర్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేశారు. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించి మొత్తం 9 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గురువారం రోజున ప్రభుత్వం 2023-24 బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. మార్చి 17వ తేదీన బడ్జెట్ పై చర్చ జరుగుతుంది.దీనికి ఆర్థికశాఖ మంత్రి సమాధానాలు కూడా ఇస్తారు.మార్చి 19వ తేదీన ఆదివారం కూడా సమావేశాలు ఉంటాయి.
ఈసారి బడ్జెట్ సంక్షేమంను దృష్టిలో ఉంచుకునే ఉంటుందని చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చెప్పారు.మార్చి 21వ తేదీ, 22వ తేదీల్లో ఉగాది సందర్భంగా సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. మార్చి 24వ తేదీన బడ్జెట్ ఆమోదం కోసం బిల్లును సభలో ప్రవేశపెడతారు. పెన్షన్‌ను రూ.3వేలు పెంచాకే ఎన్నికలకు వెళతామని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇక బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన మినిట్ టు మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం













Click it and Unblock the Notifications