కాలినడకన కార్పోరేటర్ ఇంటికి చంద్రబాబు, ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం నాడు పటమటలంకలో ఆకస్మికంగా పర్యటించారు. స్థానిక కార్పోరేటర్ గాంధీ ఇంటికి బాబు కాలికనడకన చేరుకొన్నారు.

విజయవాడ:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం నాడు పటమటలంకలో ఆకస్మికంగా పర్యటించారు. స్థానిక కార్పోరేటర్ గాంధీ ఇంటికి బాబు కాలికనడకన చేరుకొన్నారు.

పటమటలంకకు చెందిన కార్పోరేటర్ గాంధీ ఇంటిని చూసి బాబు ఆశ్చర్యపోయారు.తాటాకు ఇంటిలోనే కార్పోరేటర్ నివాసం ఉన్న విషయాన్ని చూసీ ఆయన ఆశ్చర్యపోయారు.

భద్రతాసిబ్బంది అడుగోడ లేకపోవడంతో చిన్నారులు ముఖ్యమంత్రితో సరదాగా ముచ్చటించారు. పిల్లలను ఏం చదువుతున్నారని ప్రశ్నించారు.సరదాగా వారితో కొద్దిసేపు గడిపారు.

Andhrapradesh chief minister Chandrababu Naidu surprise visit

ఏపి ఎన్జీవో అధ్యక్షుడు ఆశోక్ బాబు ఆశోక్ బాబు కొడుకు , కోడలును ఆశీర్వదించేందుకుగాను బాబు శనివారం నాడు పటమటలంకకు వచ్చాడు.వారిని ఆశీర్వదించారు. కుటుంబసభ్యులతో ఫోటోలు దిగారు.

అక్కడే ఉన్న స్థానిక కార్పోరేటర్ చెన్నుపాటి గాంధీని పిలిచి మీ ఇంటికి వెళదాం పద అంటూ బాబు అడిగారు. అయితే అప్పటికీ భద్రతాసిబ్బంది కారు ఎక్కేశారు.

చంద్రబాబునాయుడు కాలినడకనే కార్పోరేటర్ గాంధీ ఇంటికి వెళ్ళారు.గాంధీ కుటుంబసభ్యులను పరిచయం చేసుకొన్నారు. పిల్లలతో ఫోటోలు దిగారు.బాగా చదువుకోవాలని పిల్లలకు బాబు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+