ఏపీ ప్రజలకు కేంద్రం బహుమతి..NH 544D- ఇంకా మరెన్నో..!
భారతదేశంలో రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త బహుమతిని అందించింది. రోడ్డు రవాణా వ్యవస్థలో నవ శకానికి శ్రీకారం చుట్టిన కేంద్రం అనంతపురం, గుంటూరు మధ్య 417 కి.మీ జాతీయ రహదారి NH 544Dని, ఇంకా ఎన్నో అద్భుతమైన వరాలను ఆంధ్రప్రదేశ్‌కి అందించింది.
వేల కోట్ల రూపాయలతో ఎన్ హెచ్ 544 డి
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారులను దృష్టిలో ఉంచుకుని, వాటిని అనుసంధానం చేస్తూ ఎన్ హెచ్ 544 డి 9,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమవుతోంది . ఇది పూర్తయిన తర్వాత, ఇప్పటికే ఉన్న జాతీయ రహదారులకు అనుసంధానించి రవాణా వ్యవస్థలో మరో మైలురాయిని అధిగమించనుంది. ఈ జాతీయ రహదారి నిర్మాణంతో కొన్ని రహదారులను అనుసంధానించబడితే,మరికొన్ని ఫోర్ -లేన్ హైవేలుగా అప్‌గ్రేడ్ చేయబడతాయి.

ఈ ప్రధాన పట్టణాలను కలుపుతూ NH 544D
NH 544D తాడిపత్రి,కొలిమిగుండ్ల,అవుకు, బనగానపల్లి మీదుగా అనంతపురం నుండి గుంటూరుకు అనుసంధానం చేయబడుతుంది. అలానే .. కర్నూలులోని నంద్యాల, ప్రకాశంలోని గాజులపల్లి, గిద్దలూరు, కంబం, తోకపల్లి, మరియు గుంటూరులోని వినుకొండ, నరసరావుపేట.. ఇలాంటి ప్రధాన పట్టణాలను అనుసంధానిస్తూ ఈ జాతీయ రహదారి సాగుతుంది.
ఏపీలో గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వే లపై కేంద్రం ఫోకస్
2024 చివరి నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల అభివృద్ధి,మౌలిక సదుపాయాల కల్పనకు కనీసం రూ.3 లక్షల కోట్లు వెచ్చిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ హామీలో భాగంగానే కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల పైన ప్రత్యేకమైన దృష్టి సారించింది. కేంద్రప్రభుత్వం చేపట్టిన 22 గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వేలలో ఆరు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఈ ఆరు ఎక్స్‌ప్రెస్‌వేలలో రాయ్‌పూర్-విశాఖపట్నం, నాగ్‌పూర్-విజయవాడ, హైదరాబాద్-విశాఖపట్నం మరియు బెంగళూరు-చెన్నై.. చిత్తూరు జిల్లా మీదుగా వెళుతున్నాయి.

NH 16 పై ఏపీ అభ్యర్థనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఇదే క్రమంలో NH 16 కు 40 కి.మీ తూర్పు బైపాస్ రోడ్డు నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థనకు కేంద్రం అంగీకరించింది. కృష్ణానదిపై వంతెన నిర్మాణమూ ఇందులో ఉంది. కృష్ణాజిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకు నిర్మించబడే ఈ బైపాస్ రోడ్డు విజయవాడ లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది .
గేమ్ ఛేంజర్ గా బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే
బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే వారికి ఇదొక గేమ్ ఛేంజర్. ఈ ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణాన్ని రూ. 19,200 కోట్లతో చేపట్టనున్నారు. దీనివల్ల ప్రయాణ దూరం 650 కిమీ నుండి 518 కిమీ లకు తగ్గుతుంది. అలానే సాధారణంగా 12 గంటలు పట్టే ప్రయాణ సమయం సగానికి సగం తగ్గుతుంది.
ఆరు గంటల్లోనే బెంగళూరు నుండి విజయవాడకు
ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల కేవలం ఆరు గంటల్లోనే బెంగళూరు నుండి విజయవాడకు, విజయవాడ నుండి బెంగళూరుకు చేరుకోవడానికి వీలవుతుంది.కేంద్ర ప్రభుత్వ పథకం కింద గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్ మరియు బ్రౌన్‌ఫీల్డ్ అప్‌గ్రేడ్ ల నిర్మాణం జరుగుతోంది.ఈ ఎక్స్‌ప్రెస్‌వేను భారత్‌మాల పరియోజన పథకం కింద నిర్మిస్తోంది కేంద్రం. ఈ మార్గం గుండా బెంగళూరు ఎయిర్ పోర్ట్ కి సులభంగా ప్రయాణించే సౌలభ్యం కల్పించినట్లవుతుంది.
ఇండస్ట్రియల్ హబ్స్ ని కలుపుతూ ఎక్స్‌ప్రెస్‌వే
ఈ ఆరు లైన్ల జాతీయ రహదారి గుంటూరు , ప్రకాశం ,కర్నూలు ,కడపలో ఉన్న ఇండస్ట్రియల్ హబ్స్ ని కలుపుతూ సాగుతుంది.దీనివల్ల పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుంది. కొడికొండ ,పులివెందుల ,మల్లేపల్లి, వంగపాడు,అద్దంకి,చిలకలూరిపేట మరియు గుంటూరులోని పట్టణాల మీదుగా ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఉంటుంది . ఈ ఎక్స్‌ప్రెస్ వే 2025-2026 నాటికల్లా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.

ప్రధాని మోడీ దార్శనికతతోనే ఏపీ సమ్మిళిత ప్రగతి
ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతతో ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అనుసంధానం జరుగుతోంది.ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు వ్యవస్థ రూపు రేఖలు విశేషంగా రూపాంతరం చెందుతున్నాయి.విస్తృతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా,రహదారుల విస్తరణ కొనసాగుతోంది.కొత్త రహదారుల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాలకు కూడా శీఘ్ర సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అందించిన ఈ మెరుగైన రహదారుల అనుసంధానం ఆర్థిక వృద్ధిని కూడా బాగా పెంచింది. విద్యా వైద్య సదుపాయాలను పెంచడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications