బాబు తర్వాత కేసీఆర్‌తో అనిల్ అంబానీ, రేపు పోలవరం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సోమవారం కలిశారు. వారు పలు అంశాల పైన చర్చించారు. హైదరాబాదులో తమ పెట్టుబడుల ప్రతిపాదనను అనిల్ అంబానీ సీఎంకు చెప్పారని సమాచారం. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. అంతకుముందు అనిల్ అంబాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన విషయం తెలిసిందే.

హైకోర్టు పరిధిపై ముగిసిన వాదనలు

విభజన నేపథ్యంలో హైకోర్టు పరిధి విషయమై న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఏపీకి హైకోర్టు ఏర్పాుట చేసే వరకు హైదరాబాదులోనే హెడ్ హైకోర్టు ఉండాలని వాదనలు వినిపించారు. న్యాయమూర్తులు ఎవరు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. రెండు రాష్ట్రాల కేసులు విచారించే విధంగా విభజన బిల్లులో స్పష్టంగా ఉందని హైకోర్టుకు కేంద్రం తెలిపింది.

Anil Ambani meets KCR

పార్లమెంటు ముందుకు పోలవరం ఆర్డినెన్స్ బిల్లు

పోలవరం ఆర్డినెన్స్‌పై బిల్లును లోకసభలో ప్రవేశపెట్టడం మంగళవారానికి వాయిదా పడింది. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించకపోవడంతో బిల్లును మరో రోజు ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పీకర్ అనుమతి కోరినట్లు తెలుస్తోంది.

ఉపసంహరించుకుంది: వినోద్

పోలవరం ఆర్డినెన్స్‌ను కేంద్రం ఉపసంహరించుకుందని తెరాస ఎంపీ వినోద్ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపితే అక్కడి గిరిజనులు తెలంగాణతో సంబందాలు కోల్పోతారన్న సమస్యను లేవనెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+