హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై దాడి: హైకోర్టులో పిటిషన్, అంతా పోలీసుల వల్లే: చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్: వైసీపీ అధినేత వైయస్ జగన్ పైన జరిగిన దాడి ఘటన పైన హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. విశాఖపట్నంలో జరిగిన దాడి ఘటనపై సీబీఐ చేత విచారణ జరిపించాలని పిటిషన్లో కోరారు.

<strong>ట్విస్ట్: 'జగన్‌పై ప్రాణాపాయంలేని దాడి జోస్యం నిజమైంది, సీఎం చేయాలనే పిచ్చి అభిమానమే'</strong>ట్విస్ట్: 'జగన్‌పై ప్రాణాపాయంలేని దాడి జోస్యం నిజమైంది, సీఎం చేయాలనే పిచ్చి అభిమానమే'

కలెక్టర్ల కాన్ఫరెన్సులో చంద్రబాబు

కలెక్టర్ల కాన్ఫరెన్సులో చంద్రబాబు

కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వైసీపీ నేతల వ్యాఖ్యల పైన శుక్రవారం స్పందించారు. నిన్న (గురువారం) వైసీపీ అధినేత వైయస్ జగన్ పైన జరిగిన దాడిలో పోలీసులు ఆశించిన స్థాయిలో స్పందించలేదని చెప్పారు. పోలీసుల ఆలస్యం వల్లే ప్రతిపక్షాలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాయన్నారు.

ఆలస్యంగా అయినా స్పందించాం

ఆలస్యంగా అయినా స్పందించాం

ఆలస్యంగా అయినా స్పందించాం కాబట్టి ఈ మాత్రం కట్టడి చేశామని అన్నారు. సరిగా వ్యవహరించి ఉంటే ప్రతిపక్షాలు ఇలా ఆరోపణలు చేసేవి కాదని చెప్పారు. ఓ కానిస్టేబుల్ తప్పు చేసినా నాకే చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐఎస్ఎఫ్ స్పందన సరిగా లేదని చెప్పారు. జగన్‌ను ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. దీని వల్ల టీమిండియాను ఆపేశారన్నారు.

చంద్రబాబు తీరు బాగాలేదు

చంద్రబాబు తీరు బాగాలేదు

జగన్ పైన దాడి విషయంలో చంద్రబాబు స్పందించిన తీరు ఏమాత్రం బాగా లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఆపరేషన్ గరుడ అంటూ చంద్రబాబు ప్రభుత్వం మతితప్పి మాట్లాడుతోందన్నారు. ఆపరేషన్ గరుడపై శివాజీ నుంచి వివరాలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. జగన్ పైన దాడి చంద్రబాబు స్క్రిప్ట్‌లో భాగమే అన్నారు.

Recommended Video

శివాజీ చెప్పిందే జరిగిందా.. జగన్‌పై దాడి ‘గరుడ’ పనేనా ?
 చంద్రబాబుకు పచ్చకామెర్లు బాగా ముదిరాయి

చంద్రబాబుకు పచ్చకామెర్లు బాగా ముదిరాయి

చంద్రబాబు నాయుడుకు పచ్చకామెర్లు బాగా ముదిరినట్లు ఉన్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ సాయి రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి మరిచి గల్లీ నేత కంటే ఘోరంగా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. జగన్ పైన దాడిని ఖండించిన పార్టీలను విమర్శించడం ఏమిటన్నారు. చంద్రబాబుకు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు.

 మానవ మృగంలా చంద్రబాబు

మానవ మృగంలా చంద్రబాబు

చంద్రబాబు మానవ మృగంలా మాట్లాడుతున్నారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు గత చరిత్ర అంతా రక్తసిక్తమైనదే అన్నారు. వంగవీటి రంగాను హత్య చేయించిన చరిత్ర చంద్రబాబుది అన్నారు. జర్నలిస్ట్ పింగళి దశరథ్, ఐఏఎస్ రాఘవేంద్ర రావుల హత్యల్లో చంద్రబాబు హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు.

English summary
Anil Kumar files petition in High Court over attack on YSR Congress Party chief YS Jagan Mohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X