మెజార్టీపై కెసిఆర్‌కు సవాల్, తెరాసకు జగన్ మెతుకలని

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రభుత్వ మాజీ విప్ అనిల్ కుమార్ సవాల్ చేశారు. గజ్వెల్ నియోజకవర్గంలో కెసిఆర్‌కు యాభై వేల కంటే ఎక్కువ మెజార్టీ వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, తక్కువ వస్తే ఆయన తీసుకుంటారా చెప్పాలని సవాల్ చేశారు. తెరాసను చీల్చడం పెద్ద కష్టం కాదన్నారు. కాంగ్రెసు పార్టీ నేత శ్రవణ్ కుమార్ కూడా కెసిఆర్ పైన నిప్పులు చెరిగారు.

ఎన్నికల సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఒక్కమాట కూడా మాట్లాడలేదని, ఆయన పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్లు కేటాయించారని, ఇప్పుడు జగన్ చవఎం అవుతారని ప్రకటిస్తున్నారని, దీని వెనక ఉన్న చీకటి ఒప్పందాలు ఏమిటో కెసిఆర్ బహిర్గతం చేయాలన్నారు. జగన్ కోసం కెసిఆర్ సర్వేలు చేయించాల్సిన పని ఏమిటన్నారు. ఇది నీచమైన చర్య అన్నారు.

Anil Kumar to quit politics if KCR gets over 50,000 majority

లంకలో (సీమాంధ్ర) పుట్టినోళ్లంతా రాక్షసులన్న కెసిఆర్ ఇప్పుడు రాక్షసులకు ఎందుకు వంత పాడుతున్నారన్నారు. ఇదంతా చూస్తుంటే తెరాస ప్రచారానికి జగన్ ఏమైనా మెతుకులు పడేశాడా అన్న అనుమానం కలుగుతోందన్నారు. జగన్ దోపిడీలో తెరాస వాటా ఎంతో చెప్పాలన్నారు. ఢిల్లీ అధిష్ఠానంతో టచ్‌లో ఉన్నట్లు బిల్డప్ ఇచ్చి... ఇక్కడ గెలవబోయే అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నంలో కెసిఆర్ ఉన్నారన్నారు. మజ్లిస్‌ను మభ్యపెట్టేందుకు యూపిఏకు మద్దతని మాట్లాడుతున్నారు.

ఎన్నికలకు ముందు బిజెపితో పొత్తుకు వెంపర్లాడారన్నారు. ఆ తర్వాత థర్డ్ ఫ్రంట్, ఇప్పుడు యూపీఏకు మద్దతంటున్నారని, ఫలితాలు తరువాత కెసిఆర్ ఎవరి పక్షాన ఉంటారో ఆ దేవుడికి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. అన్నం పెట్టిన చెయ్యికి సున్నం పెట్టి ఇప్పుడు కృతజ్ఞత అంటారా? పార్లమెంట్‌లో తెలంగాణ వ్యతిరేకులు ఎన్నో రకాల కుట్రలు చేసినా, ఆదిశక్తిలా నిలబడి సోనియా రాష్ట్రం ఇచ్చారని, అలాంటి తల్లిని బలి దేవత అన్నారన్నారు.

కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒకవైపు గౌరవిస్తూ మరోవైపు పొన్నాల లక్ష్మయ్యపై అవాకులు, చవాకులు మాట్లాడటం ఏమిటన్నారు. పార్టీలో చీలిక తెస్తే తెలంగాణ ప్రజలు చీరి చింతకు కడతరన్న కెసిఆర్ వ్యాఖ్యలపైనా స్పందించారు. గతంలో పార్టీ నుంచి చాలామంది బయటకు పోయారని, డబ్బులు తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, వారందరిని ఎందుకు చీరి చింతకు కట్టలేదో చెప్పాలన్నారు.

ఏళ్ల తరబడి ఉద్యమంలో పనిచేసిన వారికి కాదని, కొత్తగా వచ్చిన వారికి, తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ వ్యతిరేకులకు రాత్రికి రాత్రి కండువాలు కప్పి టికెట్లు ఇచ్చిన వారిని ప్రజలు చీరి చింతకు కట్టరా? అని ప్రశ్నించారు. రామ్మోహన్ గౌడ్, మురళీ గౌడ్, మైనంపల్లి హన్మంతరావు, ముఠా గోపాల్, చంద్రావతి, కొండా సురేఖ, చంద్రశేఖర్ రెడ్డి ఇలా పార్టీకి సంబంధం లేని 55 మందికి టికెట్లు ఇచ్చినందుకు చీరి చింతకు కట్టరా? అన్నారు.

వారు పార్టీకి ఎలా వచ్చారో, టికెట్లు ఎలా తెచ్చుకున్నారో అందరికీ తెలుసునన్నారు. గెలిచిన తర్వాత వారి దారి వారు చూసుకోకుండా ఉంటారా? అంటే.. కెసిఆర్ చేస్తే సంసారం, వేరే వాళ్లు చేస్తే వ్యభిచారమా అన్నారు. దళిత చవఎం హామీ నుంచి పక్కకుపోతే ఆ వర్గాలు తిరుగుబాటు చేస్తాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి విషయంలో సిఎల్సీ సమావేశం నిర్ణయిస్తుందని కెసిఆర్ అనడంపై స్పందిస్తూ.. జోక్ ఆఫ్ ద డికేడ్ అని ఎద్దేవా చేశారు. సొంతంగా ప్రకటించుకునే ధైర్యం లేక వాళ్లతో, వీళ్లతో మాట్లాడి సిఎం కుర్చీని ఆక్రమించుకోవడం అనైతికం కాదా? అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+